Monday, 16 January 2017

వెంటాడే నీ చూపుకు చిక్కిన ఆ తొలిరోజులు....






నీలిమేఘాల సాక్షిగా
కురిసే జడివాన పందిరిలో
తడిసిన తనువును మరచిపోయి
నీకోసం ఎదుచూసిన ఆ మధుర క్షణాలు

వేవేల అనుభూతుల అలనాటి జ్ఞాపకాలు
వెంటాడే నీ చూపుకు చిక్కిన ఆ తొలిరోజులు
నిమీలికా నయనాల వినిపించని గుసగుసలు
నీరాకను తెలిపిన పిల్లగాలి పరిమళాలు

కళ్ళు కలవరపడుతున్నాయి నేస్తం..
         కల చెదరిపోతుందేమోనని
వేడుకుంటున్నాయి ప్రతిక్షణం
          కదిలే కాలాన్ని ఆగిపొమ్మని 
 

Friday, 6 January 2017

వెండి వెన్నెల వెలుగుల్లో విరి వాన జల్లు లా ....

వెండి వెన్నెల వెలుగుల్లో
విరి వాన జల్లు లా
వెంటాడుతోంది ప్రతి నిమిషం
నులివెచ్చని నీ మందహాసం

మేఘ గమనంలో నీవే
మెరుపు గీతల్లో నీవే
కలల్లో నీవే కలవరింతల్లో నీవే
కంటి వెలుగూ నీవే కటికచీకటీ నీవే

నూరేళ్ళ ఈ జీవితం
ఎదురుచూపలకే అంకితమా
మరుగైపోనా ఈ క్షణం
మరుజన్మకిచ్చిన మాటకోసం.. నేస్తమా

venDi vennela velugullO viri vana jallu lA

venDi vennela velugullO
viri vana jallu lA
venTAdutOndi prathi nimisham
nulivecchaani nee mandahAsam

mEgha gamanamlO neevE
merupu geethallO neevE
kalallO neevE kalavarintallO neevE
kanTi velugU neevE kaTikacheekaTI neevE

nUrELLa ee jeevitam
eduruchUpalakE ankitamA
marugaipOnA ee kshaNam
marujanmakichina mATakOsam.. nEstamA


Friday, 23 December 2016

nAdannadi nAlO EdI lEdani...





venDi vennela velugullO
viritOTa virajimmina parimaLamlO
viharistOndi nA manasu
vEkuvakOsam edurujUstU

kanipinchakunDa vinipinchE
kalala kamanIya gItamlO
ninu jUstU kalavaristU
nannu nEnu marachipOtU

gAli alalapai ninnujErAlani
gunDe chappuLLa guTTu nIku ceppAlani
nAdannadi nAlO EdI lEdani
nAlO nuvvani nIlO nEnani

నాదన్నది నాలో ఏదీ లేదని...






వెండి వెన్నెల వెలుగుల్లో
విరితోట విరజిమ్మిన పరిమళంలో
విహరిస్తోంది నా మనసు
వేకువకోసం ఎదురుజూస్తూ

కనిపించకుండ వినిపించే
కలల కమనీయ గీతంలో
నిను జూస్తూ కలవరిస్తూ
నన్ను నేను మరచిపోతూ

గాలి అలలపై నిన్నుజేరాలని
గుండె చప్పుళ్ళ గుట్టు నీకు చెప్పాలని
నాదన్నది నాలో ఏదీ లేదని
నాలో నువ్వని నీలో నేనని

Saturday, 17 December 2016

అన్నీ నీసొంతమే మానవత్వం పరిమళిస్తే...

వగచే ఒంటరి మనసును
ఓదార్చే వారెవ్వరు
ఎవరి గమనంలో వారు
నీకోసం ఆగేదెవ్వరు

నీదికానిదానికోసం నిరీక్షించకు
ఎండమావుల వెంట పరుగులెందుకు
ఎందుకొచ్చావో ఈ నేలకు తెలుసానీకు
ఏక్షణం ఎగిరిపోతావో తెలియనిలోకాలకు

అందరూ ఆత్మీయులే ఆదరించే చూపుంటే
అన్నీ నీసొంతమే మానవత్వం పరిమళిస్తే

Tuesday, 6 December 2016

నేనని నీవని వేరువేరుకాదని...






కదలని కాలాన్ని అడుగుతూనే ఉన్నాను
ఈ ఎడబాటు ఇక్కెన్నాళ్ళని
మది ముంగిట వసంతం
తిరిగొచ్చేదెప్పుడని

సమీర స్పర్షల్లో నీ ఉనికే
కోయిల గీతాల్లో నీ పలుకే
సెలయేటి అలలపై నీ తళుకే
మేఘాల పందిరి పై నీ మెరుపే

నేనని నీవని వేరువేరుకాదని
నీవేనేనని తెలిసిన ఆ క్షణాన్ని
నెమరేసుకుంటూ నీరాకకోసం ఎదురుచూస్తూ