Monday, 20 March 2017

ఎద లోయల జలపాత రాగమా...


చల్లని గాలితో చేయిగలిపి
చినుకు చేస్తోంది సవ్వడి
చెలి కాలి మువ్వలా
గగన గాంధర్వ గీతంలా

సొగసరి మేఘం గర్జిస్తోంది
సొమ్మసిల్లిన జగతిని సేదదీరమంటూ
గ్రీష్మ భాస్కరుణ్ణే కప్పేస్తోంది  
ఘాటైన తాపాన్ని తగ్గించమంటూ

ఇది గడసరి సరసమా
మది పులకరింతల పరవషమా...
ఎద లోయల జలపాత రాగమా
ఎగసి పడే అలల ఆనంద దరహాసమా....


Friday, 10 March 2017

నా ఎద దాహం తీర్చావు... నీ హృదిలో నను దాచావు

ఎన్నోజన్మల స్నేహ సమీరం
నను తాకిన ఆ క్షణం
ఎలా మరువగలను నేస్తం
నీ కిలకిల నవ్వుల ఆ నవనీతం

వాడిన విరి తోటలా
ఒంటరిగా నేనుంటే
వాన చినుకు కోసం
వేయి కళ్ళతో ఎదురుచూస్తూంటే

వినీల మేఘ జలపాతంలా
వడివడిగా నేల జారి
విధి రాతల క్రీడల్లో
వేసారిన నను జేరి

నా ఎద దాహం తీర్చావు
నీ హృదిలో నను దాచావు 

nA eda dAham tIrchAvu... nI hrudilO nanudAchAvu








ennOjanmala snEha sameeram
nanu tAkina A kshaNam 
elA maruvagalanu nEstam
nee kilakila navvula A navaneetam

vADina viri tOTalA
onTarigA nEnunTE
vAna chinuku kOsam
vEyi kaLLatO eduruchUstUnTE 

vineela mEgha jalapAtamlA
vaDivaDigA nElajAri
vidhi rAtala kreeDallO 
vEsArina nanujEri

nA eda dAham tIrchAvu
nI hrudilO nanudAchAvu


Wednesday, 22 February 2017

మట్టి మరకల మేనుకు ఎన్ని గంధాలో ...






వినోదానికి కొదవలేదు
విపరీతాలకు అదుపులేదు
విపణి వీధుల్లో మేధావుల సమరాలు
విధి రాతల వింత నాటకాలు

రూపాయి కోసం రూపాలెన్ని మార్చినా
రాజ్యాలు కూల్చైనా రాసులుగా పోగేసినా
రేయనక పగలనక కాపుగాసినా
రేణువు అణువైనా నేవెంట వచ్చేనా...

నిను చూసి నవ్వుతోంది నీలి మేఘమాల
నీవూ నేనూ ఒకటేనంటూ
కరిగే వరకే కలిమిలేముల హేల
కనుమూసిన వేళ నీతో అవి కలిసిరావంటూ

మూణ్ణాళ్ళ ముచ్చటలో ఎన్ని బంధాలో
మట్టి మరకల మేనుకు ఎన్ని గంధాలో 

maTTi marakala mEnuku enni gandhAlO ....






vinOdAniki kodavalEdu
viparItAlaku adupulEdu
vipaNi vIdhullO mEdhAvula samarAlu
vidhi rAtala vinta nATakAlu

rUpAyi kOsam rUpAlenni mArchinA
rAjyAlu kUlcainA rAsulugA pOgEsinA
rEyanaka pagalanaka kApugAsinA
rENuvu aNuvainA nEvenTa vacchEnA...

ninu cUsi navvutOndi nIli mEghamAla
nIvU nEnU okaTEnanTU
karigE varakE kalimilEmula hEla
kanumUsina vELa nItO avi kalisirAvanTU

mUNNALLa muccaTalO enni bandhAlO
maTTi marakala mEnuku enni gandhAlO  

Wednesday, 15 February 2017

నీ కురుల చాయల్లో కడశ్వాస విడవాలని ...







తొలినాటి స్నేహానికి మమకారాన్ని మేళవించి
తిమిరంతో సమరంలొ తోడుగా నిలచి
నీలాల ధారల్లో నీ ప్రేమనే దాచి
నువు విసిరిన ఆ చూపును ఎలా మరువగలను
నీ చెలిమికి దూరంగా నే బ్రతకలేను

కలిమీ లేముల్లో కోరేది ఒక్కటే
నా మనసంతా నువ్వై
నను నేను మరవాలని
నీ మమతంతా నాదై
నింగిలో తేలిపోవాలని

కలికి వెన్నెల్లో నీతో కలిసి నడవాలని
నీ కురుల చాయల్లో కడశ్వాస విడవాలని 

nI kurula cAyallO kaDaSvAsa viDavAlani...








tolinATi snEhAniki mamakArAnni mELavinchi
timirmtO samaramlo tODugA nilachi
nIlAla dhArallO nI prEmanE dAchi
nuvu visirina A cUpunu elA maruvagalanu
nI celimiki dUrangA nE bratakalEnu

kalimI lEmullO kOrEdi okkaTE
nA manasantA nuvvai 
nanu nEnu maravAlani
nI mamatantA nAdai
ningilO tElipOvAlani

kaliki vennellO nItO kalisi naDavAlani
nI kurula cAyallO kaDaSvAsa viDavAlani