Saturday 28 January 2017

అలసిసొలసిన నా కళ్ళు మూసి

అక్షరానికి అందనిది
అమ్మా నీ అనురాగం
కలతలెరుగని నిదురనిచ్చిన
నీ ఒడి వెచ్చదనం

వేలుపులైన వెలకట్టలేనిది
నీ మమకార హరిచందనం
వేవేల జన్మలెత్తినా
తీర్చగలనా తల్లీ నీ రుణం

కష్టాల కడలిలో
కడదాకా పయనించావు
తీరంజేరేనాటికి తెరమరుగయ్యావు
తిరిగిరాని లోకాలకు తరలిపోయావు....

ఎలా వెళ్ళగలిగావమ్మా
ఒంటరిగా నను ఒదిలేసి
నన్నెప్పుడు తీసుకెళతావమ్మా
అలసిసొలసిన నా కళ్ళు మూసి  

No comments:

Post a Comment

Please provide your feedback here.....