వినోదానికి కొదవలేదు
విపరీతాలకు అదుపులేదు
విపణి వీధుల్లో మేధావుల సమరాలు
విధి రాతల వింత నాటకాలు
రూపాయి కోసం రూపాలెన్ని మార్చినా
రాజ్యాలు కూల్చైనా రాసులుగా పోగేసినా
రేయనక పగలనక కాపుగాసినా
రేణువు అణువైనా నేవెంట వచ్చేనా...
నిను చూసి నవ్వుతోంది నీలి మేఘమాల
నీవూ నేనూ ఒకటేనంటూ
కరిగే వరకే కలిమిలేముల హేల
కనుమూసిన వేళ నీతో అవి కలిసిరావంటూ
మూణ్ణాళ్ళ ముచ్చటలో ఎన్ని బంధాలో
మట్టి మరకల మేనుకు ఎన్ని గంధాలో