Wednesday 12 August 2015

క్రీ(నీ)డలు


కాసులు కురిపించే క్రీడలకే గాని...
కనక పతక మాలతో భరతమాత మెడను మెరిపించే ఆటలకు ఆదరణ ఏది...
దేశ ప్రతిష్ఠ కోసం కష్ట పడితే అవసానదశ లో అనుభవించేది నికృష్ఠ జీవితమేనా...
నురుగులు కక్కేలా పరుగులు తీసిన కాళ్ళు  నడవలేకుంటె...
అంతుచిక్కని వ్యాధి వ్యధలు పెడుతూంటె...
ఆదుకొమ్మని ఆర్తనాదాలు పెడుతున్నాయి అలనాటి ఆటగాళ్ళ రిక్త హస్తాలు...
తుప్పు పట్టిన అధికారుల వీనులకు వినిపించడం లేదు...
కైపెక్కిన నేతల కళ్ళకు కనిపించడం లేదు...
లక్షల  గొంతుకల  కేరింతల నడుమ లక్ష్యాన్ని చేధించి...
మువ్వన్నెల పతాకాన్ని రెపరెప లాడించిన  రణధీరులు... 
రెక్కాడని రోజుల్లో బిక్షగాళ్ళవుతున్నారు...
పతకాలు తేలేరని పళ్ళికిలెస్తే సరికాదు...
కంటి తుడుపు నిధులతో కరములు దులుపుకుంటె సరిపోదు...
పక్షపాతం  పక్కన పెట్టి... ప్రతిభకే పట్టం కడితే...
సొంతలాభం కొంతైనా వెనక్కు నెట్టి... విస్వస్థాయి వనరులు సమకూర్చుకుంటె...
పసిడి పతకాలు వరదలై పారవా...
భరతయువత ప్రతిభ భూమండలమంతా పరిమళించదా...
కొటికొక్కటొచ్చినా  శతాధిక స్వర్ణాలు మనవి కావా...
గతవైభవ వీరులను ఆదుకోవాలి... భావితరాల యువశక్తికి స్పూర్తినివ్వాలి...

***************************

కొన్ని చేదు నిజాలు...

మొహమ్మద్ యూసుఫ్:
ఫుట్బాల్ ప్లేర్.
ఒకసారి అతని ఇంటి మీదుగా  వెళుతున్న  స్కూల్ పిల్లవాడు, పేదరికం కొట్టొచినట్టు కనిపిస్తూ... పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా వణుకుతున్న అతని చేతిని చూసి...
"తాతా నీవు చిన్నప్పుడు వ్యాయామం చేయలేదా...?"
"చేశాను... ఫుట్బాల్ ప్లేర్ని..."
"పొరపాటుచేశావు... క్రికెట్ ఆడిండాల్సింది..."
బాధ పడుతూ వెళ్ళిపోయాడు... 
ఆ పిల్లవాడికి తెలియదు... యూసుఫ్  అర్జున్ అవార్డు గ్రహీత అని...  1962 ఏసియన్  గేంస్ ఫైనల్ లో దక్షిణ కొరియాను ఓడించి,  మొదటి సారిగా దేశానికి బంగారు పతకం తెచ్చిన ఫుట్బాల్ టీం మెంబరని...  ఏసియన్  ఆల్ స్టార్స్ టీం కు ఎన్నికయిన ఇద్దరు భారతీయులలొ ఒకడని...

తెగిన చెప్పును కుట్టించుకునే స్థోమత లేక  పిన్ను తగిలినిచుకుని, చేతులు వణుకుతూ...  బక్షాగాడి లా కనిపిస్తున్న  యూసుఫ్  ను చూసి ఎవరు మాత్రం వూహించగలరు...

మాఖన్  సింగ్ :
రన్నర్, 1962 ఏసియన్ గేంస్ లో ఒక స్వర్ణం, ఒక రజిత పతక విజేత... 1964 లొ కలకత్తా లొ మిల్కా సింగ్ ను 400 మీ.  పందెంలో రెండడుగుల దూరంతో ఓడించిన ప్రతిభాశాలి... అర్జ్జున్ అవార్డు గ్రహీత... మధుమేహం(డయబిటీస్) కారణంగా కాలును కోల్పోయి...  ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే ఆర్థిక స్తోమత లేక... బ్రతుకు బండిని లాగించడనికి ఓ చిన్న స్టేషనరి  కొట్టు నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు... 

ఒకసారి... అర్జున్ అవార్డు గ్రహీతలకు  రైల్వె కాంప్లిమెంటరి పాస్ ఇస్తున్నారని తెలిసి డిల్లీ లోని రైల్వె భవనుకు వెళితే    అతన్ని బిక్షగాడిగా భావించి , లోపలికి అనుమతినివ్వలేదు... సుమారు రెండు గంటల కాలం వివరించి ౠజువు చేసుకున్న తరువాత అనుమతిచ్చారు... 

గోపాల్ బెంగ్రా:
1978, అర్జేటీనా లో జరిగిన హాకీ వర్ల్డ్ కప్ టీం మెంబర్ ... ఎన్నో విజయలు సాధించి పెట్టిన ఆటగాడు... బ్రతుకు తెరువు కోసం మురికి కాలువల్లొ చేపలు పట్టుకుంటూ..., రాళ్ళు కోట్టె కూలీగా   జీవితం గడిపాడు... ఈ బిహారి వీరుడు...

సర్వాన్ సింగ్:
"నీవు గెలిస్తే అది దేశం గెలుపవుతుంది..." ఇవి అతని గురించి జవహర్ లాల్ నెహ్రూ గారు అన్న మాటలు...
1954 ఏసియన్ గేంస్ 110 మీ... హర్దిల్స్ లో స్వర్ణ పతక విజేత... తరువాత అతన్ని పలకరించిన దిక్కులేదు...
పొట్టకూటి కోసం టాక్సి  డ్రైవరు అవతారమెత్తాల్సి వచ్చింది...  

ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది.... మంచి రోజులు రావాలని... ఒలింపిక్స్ లో మన దేశం పేరు మొదటి స్థానంలొ చూడాలని ఆశిద్దాం...   

Friday 7 August 2015

ఓ కధ విందామా...!

"బస్టాండ్ లో ఉండడం ఇబ్బందిగా వుందండి..... ఒకటే గొడవ..... ఏదైనా గుడి చూసుకోవడం మంచిది...."
"రాత్రిళ్ళు మూసేయరూ...?"
"నిజమే"
వృద్ద దంపతుల సంభాషణ... రమణారావు...సుమారు డెబ్బై ఏళ్ళు.. రాజ్యలక్ష్మి... ఓ ఐదేళ్ళు చిన్నది, వీరికి ముగ్గురు   కొడుకులు. పెద్దవాడేమొ అమెరికాలొ సెటిలయిపోయాడు. పలకరింపులు ప్రత్యుత్తరాలు ఏమివుండవు.. రెండవవాడు బిజినెస్. వాడికి జీవితాలన్నా వ్యాపారమే.. మూడవవాడు ప్రభుత్వ వుద్యోగి. ప్రభుత్వమే వాడిదన్న  ఫీలింగ్ ఎక్కువ. వున్న కొద్దిపాటి ఆస్తులు పంచుకున్నారు గాని భాద్యతలు పంచుకోవాలంటె ఇష్టం లేదు.. గొడవలు... హద్దు దాటిన ప్రవర్తనలు బాధ పెట్టేసరికి, భరించలేక ఇద్దరూ తమవాళ్ళకే కాకుండా సొంతవూరికి కూడా చాలా దూరంగా, ఎవరూ తమని గుర్తుపట్టలేని ప్రాంతానికి వచ్చేశారు...  ముసలి కడుపులు నింపుకోవడాని ఏదో ఒక పని దొరక్కపోదా అనుకున్నారు .. రెండు నెలలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.. వానాకాలం చదువులు, పైబడిన వయస్సు.. సరైన చికిత్స కరువై మందగించిన కంటిచూపు. అది అర్థం చేసుకోవడానికి ఇంతసమయం పట్టింది.. మొదటి రెండురోజులు లాడ్జిలో గడిపారు. ఆర్థిక పరిస్తితులు అంచానా వేసి, మకాం ను బస్టాండుకు మార్చారు...  ఆధారమేదైనా దొరికితే గుడిసె లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చులే అనుకున్నారు...

"పొరపాటు చేశామంటావా...?"
"ఏమొ"
"అది కాదే.... వాడు నాపై చేఎత్తాడు.. చూశావుగా...."
మౌనం...
"అభిమానం  అణుచుకోలేక పోయాను... రాజ్యం... నువ్వక్కడనే వుండాల్సింది.. నువ్వు చాకిరీకి పనికొస్తావు... నేనె, వారికెందుకు వుపయోగపడను... "
మౌన రోధనె సమాధానమయింది..  
రాజ్యలక్ష్మి ఆలోచనలు రాబోయె కష్టాల చుట్టూనే వున్నాయి.. తెచ్చిన డబ్బు పూర్తిగా అయిపోవచ్చింది.. వాళ్ళను బిక్షగాళ్ళుగా భావించి  ఒకరిద్దరు రాజ్యలక్ష్మి చేతిలో చిల్లర వేశారు... రమణారావుకు విషయం తెలిస్తే తట్టుకోలేడని తెలుసు.. ఆ పరిస్థిలో అమెకది తప్పుగా అనిపించలేదు.. రమణారావు కంటపడకుండా కొద్దిరోజులు ఆ పని చేయక తప్పదు... తను కడుపు కాల్చుకోగలదు కాని భర్త ఆకలి బాధ పెడుతుంది... ఎలా... ముందు బస్టాండునుండి బయటపడాలి... కలత నిద్రలోకెళ్ళి పోయింది..

మరుసటి రోజు, దగ్గరలోనే వున్న ఒక పాడుబడిన మంటపానికి మకాం మార్పించింది రాజ్యలక్ష్మి.. ఓ ఇంట్లొ పనికుదిరిందని అబద్దం చెప్పి బిక్షాటన మొదలెట్టింది... మొహమాటం తో ప్రాణం పోయినంత బాధగా అనిపించినా,  ఏదైనా పని దొరికేవరకు తప్పదని   సరిపెట్టుకుంటోంది.. ఒక్కతే అయితే ఈపాటికి ఆత్మహత్యకు   పాల్పడేదేనేమొ..

కొద్దిరోజులు గడిచాక రాజ్యలక్ష్మికి ఒక ఇంట్లొ పాచి పని దొరికింది... అడ్వాన్సు కూడా ఇచ్చారు..  వాళ్ళుంటున్న మంటపానికి దగ్గరలోనె ఇల్లు.. ఆమె ఆనందానికి ఆవధులు లేవు... భర్తకిష్టమైన ఆహారం కొనుక్కొని మంటపంవైపు పరుగులుతీసింది...భర్తకు వడ్డించింది... కబుర్లు చెప్పింది... కాళ్ళుపట్టింది... నిద్రపుచ్చింది...

ఉదయం ఎవరో తట్టిలేపుతున్నారు... రమణయ్య వులిక్కిపడి లేచాడు... ముగ్గురు పోలీసులు మరో ఇద్దరు.. రమణయ్యకు విషయం అర్థంకాలేదు... బహుశా ఈ మండపం లో కాపురం చేస్తునందుకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారేమొ అనుకున్నాడు....

"మాకు తెలియదండి... ఇప్పుడే ఖాళీ చేసెస్తాం సార్..."
"అది సరే, రాజ్యలక్ష్మి మీ భార్యెనా...?"
"అవునండి... ఏం చేసింది...?"
"అదేం లేదు... మీ ఆవిడ వీళ్ళింట్లొ పనికి కుదిరింది... వీళ్ళిచ్చిన ఇన్ ఫర్మేషన్  ఆధారంగా మి దగ్గరికి వచ్చాము... రాత్రి ఆ కనిపించే రోడ్డు దాటుతుండగా ఆవిణ్ణి ఓ లారి గుద్దేసింది... మీరోసారి మాతో రండి..."  

రమణయ్యకేమి అర్థం కావడం లేదు... ఓ రకమైన భయం మొదలైంది...చుట్టూ వెతుకుతున్నాడు....

"సార్ పొరపాటు పడ్డట్టున్నారు, రాత్రి ఆమె నాతొనే వుంది...."

జీపులో హాస్పిటల్ తీసుకెళ్ళారు...  అది రాజ్యలక్ష్మే... రమణయ్యకు నోట మాట రావడం లేదు...  ఏడుపుకూడా రావడం లేదు...

"చనిపోయిందయ్య.... మీ వాళ్ళెవరైనా వున్నారా.....?"

లేరన్నట్టు తల వూపాడు.... వేడి నిట్టూర్పులు...  జాలి పలుకుల గుసగుసలు... రమణయ్యకు స్పర్షకూడా తెలియని  పరిస్థితి...రాజ్యలక్ష్మిని అలా చూళ్ళేక పోతున్నాడు....తెలియకుండానే అడుగులు బయటికి తీసుకెళ్తున్నాయి...లీలగా ఇన్స్పెక్టర్ గొంతు వినిపిస్తోంది... "శవాన్ని పోస్ట్ మార్టం తరువాత మునిసిపాల్టి వాళ్ళకు అప్పగించేయండి... ఆ..  అలాగె    ఆ  పెద్దాయన్ను ఏదైన అనాధ శరణాలయం లో చేర్పించండి......" 

ఎటు వెళ్తున్నాడొ తెలియడం లేదు... రాత్రి భార్య చెప్పిన మాటలు... చూపించిన ప్రేమ... కళ్ళముందు కనిపిస్తోంది... రాత్రి తనదగ్గరకు వచ్చిందెవరు....? కాళ్ళుపట్టిందెవరు....? వణుకుతున్న కాళ్ళు రోడ్డెక్కాయి... 

బిజ్జీ గా వున్న రొడ్డు శబ్దాలేవి వినిపించడం లేదు... అందులో విపరీతంగా అరుస్తోన్న బస్సు హార్న్ కూడా వుంది...

అంతె... బస్సు రమణయ్యను గుద్దడము... రమణయ్య ఆకాశంలోకెగరడము చిటికెలో జరిగిపోయాయి... రాజ్యలక్ష్మిని అందుకొనేంత ఎత్త్తుకు ఎగిరాడేమో.... నేల చేరేప్పటికి ప్రాణం... లేదు...

మండేసుర్యుడికి కూడా చూట్టానికి  మనసొప్పకేమో, మబ్బు చాటుకు వెళ్ళి పోయాడు... ఆకాశం రోదిస్తున్నాట్టు   చినుకులు మొదలయ్యాయి... దిక్కు లేని వారికి ఏకైక దిక్కు ప్రకృతి మాతే కదా.... 

మనకు రోజూ కనిపంచే బిక్షగాళ్ళలో రమణయ్యలెంతమందో... రాజ్యలక్ష్మిలెంతమందో... ఒక్కసారి ఆలొచించండి.. కసురుకోకండి..

Wednesday 5 August 2015

KANUMARUGAINA KALAAM

vignAnula vithathi naDuma virAT svarUpam ......virinchikE vismayam kaliginchE vyakthithvam ....
kalaluganaDam nErpina karmayOgi keerti bhAvi tharAlaku tharagani spUrti....
manasulu gelichina machalEni  punnami candamAma... 
sudheerga jeevana yAnam  lO sva sukhamerugani sahanaSheeli.. dharaNi garvinchadagina dheeshAli..
kona oopiri varaku jana sEva lOne gaDipina niranthara sainikuDu...
nisvArtha ShrAmikuDu... nirupamAna saitikuDu...
divijErina diggajAniki  neerAjanamu...
maraginchE manasthApam lO marO mahAtmuni mahAprasthAnam..
kanumarugai pOyina  kalAm  chirunavvuku aShrunayanAlatO  Akhari salAm...