Saturday 30 May 2015

దినకర తాపము


పరాకాష్ట చేరిన భానుని ప్రతాపం....
మండే ప్రచండ జ్వాలల నడుమ ప్రాణి కోటి విలాపం....
కొంతమందికే చలిమర గదుల విలాసం..... విహారాల వైభోగం.....
వయసు మళ్ళిన విగత కూలీల శవాలు
మగత కమ్మిన మన నాయకుల స్వార్థానికి సాక్ష్యాలు......
కాలుశ్య మంటల్లో వుడికి పోతున్న పుడమి గ్రీశ్మ తాపానికి విలవిలలాడిపోతోంది....
చిరిగిపోయిన ఓజోను తెర వెర్రి విజ్ఞానాన్ని వెక్కిరిస్తోంది...
అతినీలలోహిత కిరణాలు అమాయక జీవుల అసువులు హరిస్తున్నాయి...
అడుగున దాచుకున్న నీళ్లన్ని ఆవిరైపోతున్నయి..
ప్రసన్న వదన మన ప్రకృతి మాత మన వికృత  చేష్టల వలన రక్కసి గా మారుతోంది....
మనం మారకుంటె మన రాబోయె తరం రక్కసి పాలె... అంగారకుని లాగ అవని కూడా ఆరని జ్వాలే...
చలువ చందనాల చంద్రలోకంలో కలువ పందిరికింద కునుకు తీద్దామా...
కడలి  అడుగున జేరి అరుణ కిరణ జ్వాలను ఆడ్డుకుందామా.... 

Friday 22 May 2015

మైండ్ గేం

అల్లరి మనసు ఆగడాలు వర్ణించనలవిగావు....
ఒక క్షణం అలల అంచులపైన.... మరుక్షణం అంబుధి అగాధం లోన....
వేగం దీని గుణం... చాంచల్యం దీని లోపం....
కాల పరిమితులు  లేవు... ఆస్పద అవధులు లేవు....
గగన వీధుల్లో గ్రహాంతర ప్రయాణమైనా...
గతపు పొరల నుండి  భవిష్యత్ వూహల సంయానమైనా... రెప్పపాటు చాలు ....
భాష మౌనమే ఐనా భావాలకు పుట్టినిల్లు...
ఆవేశోద్రేకాలకు ఎక్కుపెట్టిన విల్లు...
విరిగిన మనసు విపరీత పరిణామాల గని...
మంచివైపు వెళితే మరపురాని విజయం నీదె...
మరోవైపు వెళితే మధుకలశంలో సమాధె...
అంతరాత్మను అందల మెక్కిస్తె... జగమంతా ఆనందమయం...
మనసుకు పట్టం కడితె... మనుగడ శూన్యం...

Monday 11 May 2015

దేవుని చిరునామ...

ఆదినుండి అనంతవిశ్వంలొ అన్వేషణ జరుగుతూనే వుంది..
లెక్కించనలవికాని పాలపుంతలనడుమ పుడమి వైశాల్యమెంత....?
మూడింతల నీటి మధ్యన మట్టి నేల పరిమాణమెంత......?
అతిధిగా అవని చేరిన నీ ఆకారమెంత.....? అవగాహనెంత....?
వసుంధర వయసుముందు నీ ఆధునిక విజ్ఙాన ప్రాయమెంత...? పరుధులెంత....?
అప్పుడే పుట్టిన పురిటి శిశువు విరించిని చూసి వెక్కిరించినట్టున్నాయి విజ్ఙానపు వీచిపలుకులు...
నా వునికిని ప్రశ్నించే ముందు నీ అర్హతను తెలుసుకోవెందుకు.....?
దినకరుని లేత కిరణాలను రెప్పపాటు కాలం వీక్షించలేని నీ తోలు చక్షువులు
కోటిరెట్ల తీక్షణ కాంతి పుంజాన్ని భరించగలవా ...? నన్నుచూడగలవా ...?
నిశ్కల్మష  హృదయం... నా నివాసం ...అకుంఠిత విశ్వాసం దారి చూపె దీపం...
అలుపెరుగని ప్రయత్నం నా దరి చేర్చె నావ ...జ్ఞానికి జగమంతా నా రూపమె..
పసి పాపల పసిడి నవ్వుల్లో ... పూచె పువ్వుల్లో .. మూగజీవుల ఆకలి చూపుల్లో ...
సాధుజనుల సాంగత్యంలో ... సెలయేటి గలగలల్లో... అలల నురుగుల్లో... మలయ మారుతంలో... మమతానుబంధాల్లో..బాదితుల ఆర్ద్రంలో...
అమ్మ ప్రేమలో...  అన్నింటిలోను నేనె...నేను కానిది యేది లేదు...
నిర్వికారం... నిరంజనం...నీ నిర్మల హృదయంమె నా చిరునామ...

Friday 8 May 2015

ఓ మనిషి తిరిగిచూడు ....

ఆమ్మ చాటు ప్రాయంలొ అంతరాలు ... అంతరంగాలు తెలిసేవి కాదు....
అడిగినవన్ని ఇఛ్ఛేది   ... అడగకుండానె ఆకలి తీర్ఛేది...
చిన్ని క్రిష్నున్ని చేసేది... అందాల రాముడినని పొగిడేది.... చెంగుచాటుచక్రవర్తిని అనిపించేది
" 'అమ్మకు చెబుతా " అన్న ఆయుధంతో అతిరధులనైన ఓడించేవాడిని....  
నా మొదటి అడుగు గుర్తులేదుగాని అమ్మ తుదిశ్వాస బాగా గుర్తు... 
ఆక్షర్యం  .. ఆక్షణంలో కాలం ఆగిపోలేదు... ఎవరి దినచర్యల్లోను మార్పులేదు.. 
అమ్మ పలుకు ఆగిపోఇంది... ప్రకృతి  స్టంభించలేదెందుకు ... ఆబాధను వర్ణించడానికి దేవుడు పదాలనివ్వలేదెమిటి....
చిన్న బాధకే ప్రతిస్పందించే అమ్మ నా ఆవేదనాశ్రువులను  పట్టించుకోదేమిటి ...
జాలిగా చూసిన చూపులు... ఇప్పుడు దొరికావంటూ విధి వెక్కిరింపూ అన్నీ గుర్తున్నాయి..
ఎంతగా ఏడ్చినా వీడని అమ్మ మౌనం గుర్తుంది..
కష్టాలను మింగింది.. సుఖాలను పంచింది...  సుఖపడే సమయానికి కనిపించని దూరాలకు వెళ్లిపొయింది  ...
దారిలొచేయిచాచె అమ్మల కళ్ళల్లొ పలకరింపుగ కనిపిస్తుంది... కంటతడిపెట్టిస్తుంది..
ఎంతమందినో కన్నకడుపులు ఆకలికి తట్టుకోలెక రోడ్డ్లెక్కుతున్నాయి ... ప్రత్యక్షదైవాలు దిక్కులేని అనాథలుగ వీధుల్లొ తనువులు  చాలిస్తున్నాయి
జాలిలేని కొడుకుల వునికికి సాక్ష్యంగా... అలుముకుంటున్న రాక్షస  సంస్కృతికి బలిపశువుగా.. .
మాటలు రాని మృగాలు సైతం కారుణ్యం  ప్రదర్షించిన సంధర్భాలెన్నో  .....
మానవత్వన్ని కాలరాస్తు  క్షణిక సుఖాల మత్తులో  మనిషి పయనం ఎటువైపో .....
తిరిగి చూసుకునేప్పటికి.... మిగిలేది శూన్యమె... 

Saturday 2 May 2015

గతం

నీ ప్రతి కదలిక  నేనె... ప్రణాళికలు..ప్రమాణాలు..పదవిన్యాసల పరిణామాలు...ప్రతి పుటలొ కనిపించె ప్రామాణిక నిభంధనలు......

అలకలు...అలసటలు...అన్నీ నేనె...
ఆత్మీయుల మహాప్రస్థానంలొ పెల్లుబికిన మౌనవిలాప రుధిరాష్రు జలపాతాన్ని నేనె...

నవ్యానుబంధ క్షణాల ఆనంద భాష్పాన్ని కూడా  నేనె...

అలజడులు నేనె ... అమృత గడియలు నేనె...
నిర్ణయాల నిమిషంలొ హెచ్చరికను నేనె...

శూన్యం లోకి జారిఫొయె నీ ప్రతి నిమిషానికి సాక్ష్యాన్ని నేనె...

గమనించావా..!... అలనాటి రంగుల కలను నేను...
జ్ఞాపకాల అలను నేను  ... నీ భవిష్య నిర్మాణంలొ జ్ఞానజ్యొతిని నేను...

నీ గతాన్ని నేను... నీ గతాన్ని నేను.. 

Ghatham

nee prathi kadhalika neney... praNaalikalu..pramaaNaalu..padhavinyasala pariNaamaalu...prathi putalo kanipinche pramaanika nibhanDhanalu......

alakalu...alasatalu...anni neney...
Aathmeeyula maHaa prasthanamlo pellubikina mounavilaapa ruDhiraashru jalapathaanni neney...

navyanubanDhaKShaNaala Aanandha Bhashpaanni kudaa neney...

alajadulu neney ... amrutha gadiyalu neney...
nirNayaala nimishamlo hechcharikanu neney...
nimeeshamlo kalisipoye nee prathi nimishaaniki saakshyaanni neney...

gamaninchaavaa..!... alanaati kalanu nenu...
gnyaapakaala alanu menu ... nee Bhavishya nirmaaNamlo gnyaana jyothini nenu...

nee gathanni nenu... nee gathanni nenu..