Tuesday, 28 July 2015

కనుమరుగైన కలాం....

విజ్ఞానుల వితతి నడుమ విరాఠ్ స్వరూపం ......విరించికే విస్మయం కలిగించే వ్యక్తిత్వం ....
కలలుగనడం నేర్పిన కర్మయోగి కీర్తి భావి తరాలకు తరగని స్పూర్తి....
మనసులు గెలిచిన మచ్చలేని  పున్నమి చందమామ... 
సుధీర్గ జీవన యానం  లో స్వ సుఖమెరుగని సహనశిలి.. ధరణి గర్వించదగిన ధీశాలి..
కొన ఊపిరి వరకు జన సేవ లోనె గడిపిన నిరంతర సైనికుడు...
నిస్వార్థ శ్రామికుడు... నిరుపమాన సైతికుడు...
మరగించే మనస్తాపం...  మరో మహాత్ముని మహాప్రస్థానం.. దివిజేరిన దిగ్గజానికి  నీరాజనం...  
కనుమరుగై పోయిన  కలాం  చిరునవ్వుకు అశ్రునయనాలతో  ఆఖరి సలాం...

Wednesday, 15 July 2015

NESTHAMAA...

puDami chErina pradhama kshaNamE palakarincina pillagAlitO modalaindi modaTi snEham...
buDi buDi naDakala baDi prAyamlO kalmashamerugani  kamanIya snEham...
vaDi vaDi parugula vayasoccinA vanne taggani neyyamu ... vAvi varasala vAtsalyamu...
cilipi cEShTala cammadanamu... jilibili tagavula tiyyadanamu...
sAhasAlaku venukADani sahavAsagALLatO gaDipina allari tiruguLLa rAtriLLu....
vinOdAla anchulu tAkina sandaLLu.. haddumIrinappaTi amma nAnnala akshintalu... gurtunnAyA nEstham...
vidhi  bAdhitulamai visiri vEyabaDDAmE gAni..eda gondi lO anurati alAgE vundi..
madhura smRutulalO tEliyaDutUnEvundi... vunTundi... maru kalayika kOsam eduruchUsthUnE vunTundi...  

నేస్తమా ....


పుడమి చేరిన ప్రధమ క్షణమే పలకరించిన పిల్లగాలితో మొదలైంది మొదటి స్నేహం...
బుడి బుడి నడకల బడి ప్రాయంలో కల్మషమెరుగని  కమనీయ స్నేహం...
వడి వడి పరుగుల వయసొచ్చినా వన్నె తగ్గని నెయ్యము ... వావి వరసల వాత్సల్యము...
చిలిపి చేష్టల చమ్మదనము... జిలిబిలి తగవుల తియ్యదనము...
సాహసాలకు వెనుకాడని సహవాసగాళ్ళతో గడిపిన అల్లరి తిరుగుళ్ళ రాత్రిళ్ళు....
వినోదాల అంచులు తాకిన సందళ్ళు.. హద్దుమీరినప్పటి అమ్మ నాన్నల అక్షింతలు... గుర్తున్నాయా నేస్తం...
విధి  బాధితులమై విసిరి వేయబడ్డామే గాని..ఎద గొంది లో అనురతి అలాగే వుంది..
మధుర స్మౄతులలో తేలియడుతూనేవుంది... వుంటుంది... మరు కలయిక కోసం ఎదురుచూస్తూనే వుంటుంది...