Wednesday 12 August 2015

క్రీ(నీ)డలు


కాసులు కురిపించే క్రీడలకే గాని...
కనక పతక మాలతో భరతమాత మెడను మెరిపించే ఆటలకు ఆదరణ ఏది...
దేశ ప్రతిష్ఠ కోసం కష్ట పడితే అవసానదశ లో అనుభవించేది నికృష్ఠ జీవితమేనా...
నురుగులు కక్కేలా పరుగులు తీసిన కాళ్ళు  నడవలేకుంటె...
అంతుచిక్కని వ్యాధి వ్యధలు పెడుతూంటె...
ఆదుకొమ్మని ఆర్తనాదాలు పెడుతున్నాయి అలనాటి ఆటగాళ్ళ రిక్త హస్తాలు...
తుప్పు పట్టిన అధికారుల వీనులకు వినిపించడం లేదు...
కైపెక్కిన నేతల కళ్ళకు కనిపించడం లేదు...
లక్షల  గొంతుకల  కేరింతల నడుమ లక్ష్యాన్ని చేధించి...
మువ్వన్నెల పతాకాన్ని రెపరెప లాడించిన  రణధీరులు... 
రెక్కాడని రోజుల్లో బిక్షగాళ్ళవుతున్నారు...
పతకాలు తేలేరని పళ్ళికిలెస్తే సరికాదు...
కంటి తుడుపు నిధులతో కరములు దులుపుకుంటె సరిపోదు...
పక్షపాతం  పక్కన పెట్టి... ప్రతిభకే పట్టం కడితే...
సొంతలాభం కొంతైనా వెనక్కు నెట్టి... విస్వస్థాయి వనరులు సమకూర్చుకుంటె...
పసిడి పతకాలు వరదలై పారవా...
భరతయువత ప్రతిభ భూమండలమంతా పరిమళించదా...
కొటికొక్కటొచ్చినా  శతాధిక స్వర్ణాలు మనవి కావా...
గతవైభవ వీరులను ఆదుకోవాలి... భావితరాల యువశక్తికి స్పూర్తినివ్వాలి...

***************************

కొన్ని చేదు నిజాలు...

మొహమ్మద్ యూసుఫ్:
ఫుట్బాల్ ప్లేర్.
ఒకసారి అతని ఇంటి మీదుగా  వెళుతున్న  స్కూల్ పిల్లవాడు, పేదరికం కొట్టొచినట్టు కనిపిస్తూ... పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా వణుకుతున్న అతని చేతిని చూసి...
"తాతా నీవు చిన్నప్పుడు వ్యాయామం చేయలేదా...?"
"చేశాను... ఫుట్బాల్ ప్లేర్ని..."
"పొరపాటుచేశావు... క్రికెట్ ఆడిండాల్సింది..."
బాధ పడుతూ వెళ్ళిపోయాడు... 
ఆ పిల్లవాడికి తెలియదు... యూసుఫ్  అర్జున్ అవార్డు గ్రహీత అని...  1962 ఏసియన్  గేంస్ ఫైనల్ లో దక్షిణ కొరియాను ఓడించి,  మొదటి సారిగా దేశానికి బంగారు పతకం తెచ్చిన ఫుట్బాల్ టీం మెంబరని...  ఏసియన్  ఆల్ స్టార్స్ టీం కు ఎన్నికయిన ఇద్దరు భారతీయులలొ ఒకడని...

తెగిన చెప్పును కుట్టించుకునే స్థోమత లేక  పిన్ను తగిలినిచుకుని, చేతులు వణుకుతూ...  బక్షాగాడి లా కనిపిస్తున్న  యూసుఫ్  ను చూసి ఎవరు మాత్రం వూహించగలరు...

మాఖన్  సింగ్ :
రన్నర్, 1962 ఏసియన్ గేంస్ లో ఒక స్వర్ణం, ఒక రజిత పతక విజేత... 1964 లొ కలకత్తా లొ మిల్కా సింగ్ ను 400 మీ.  పందెంలో రెండడుగుల దూరంతో ఓడించిన ప్రతిభాశాలి... అర్జ్జున్ అవార్డు గ్రహీత... మధుమేహం(డయబిటీస్) కారణంగా కాలును కోల్పోయి...  ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే ఆర్థిక స్తోమత లేక... బ్రతుకు బండిని లాగించడనికి ఓ చిన్న స్టేషనరి  కొట్టు నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు... 

ఒకసారి... అర్జున్ అవార్డు గ్రహీతలకు  రైల్వె కాంప్లిమెంటరి పాస్ ఇస్తున్నారని తెలిసి డిల్లీ లోని రైల్వె భవనుకు వెళితే    అతన్ని బిక్షగాడిగా భావించి , లోపలికి అనుమతినివ్వలేదు... సుమారు రెండు గంటల కాలం వివరించి ౠజువు చేసుకున్న తరువాత అనుమతిచ్చారు... 

గోపాల్ బెంగ్రా:
1978, అర్జేటీనా లో జరిగిన హాకీ వర్ల్డ్ కప్ టీం మెంబర్ ... ఎన్నో విజయలు సాధించి పెట్టిన ఆటగాడు... బ్రతుకు తెరువు కోసం మురికి కాలువల్లొ చేపలు పట్టుకుంటూ..., రాళ్ళు కోట్టె కూలీగా   జీవితం గడిపాడు... ఈ బిహారి వీరుడు...

సర్వాన్ సింగ్:
"నీవు గెలిస్తే అది దేశం గెలుపవుతుంది..." ఇవి అతని గురించి జవహర్ లాల్ నెహ్రూ గారు అన్న మాటలు...
1954 ఏసియన్ గేంస్ 110 మీ... హర్దిల్స్ లో స్వర్ణ పతక విజేత... తరువాత అతన్ని పలకరించిన దిక్కులేదు...
పొట్టకూటి కోసం టాక్సి  డ్రైవరు అవతారమెత్తాల్సి వచ్చింది...  

ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది.... మంచి రోజులు రావాలని... ఒలింపిక్స్ లో మన దేశం పేరు మొదటి స్థానంలొ చూడాలని ఆశిద్దాం...   

No comments:

Post a Comment

Please provide your feedback here.....