ప్రకృతి పలకరించిన క్షణం తనువంతా పరవశం...
పళ్ళుకొరికిని దినం ప్రళయ ఝరిలో విలీనం...
కన్నెర్ర జేసిన కాలమేఘం... జడివానల నడుమ జనసందోహం...
కానరాని నిగమచాయలు... నడి ముంగిట్లో పలకరిస్తున్న మురికి కాలువలు...
నేరమెవరిది నిఠాలాక్షా... సామాన్యుడికేనా నిరంతరమూ పరీక్ష....
డ్రైనీజిల పైన దర్షనమిస్తాయి ధనవంతుల కట్టడాలు...
దారితెలియని వరద జలాలకు రహదారులే చిరునామాలు...

పడవలే ప్రధాన వాహనాలు...
వంటకు వనరులు లేవు... కంటికి నిదురలేదు...
కడుపు మంటకు ఊరట లేదు...
సర్పాల బెదిరింపులు... అంధకార రాత్రులు...
కూలిపోతున్న గోడలు... రాలిపోతున్న ప్రాణాలు....
పసిపాపల ఆకలి కేకలు... కన్నవాళ్ళ అరణ్య రోదనలు...
నీళ్ళ మధ్యనే జీవనం... కన్నీళ్ళతోనే తీర్చుకోవాలి దాహం...
ఎన్నాళ్ళీ పోరాటాలు... ఆపన్న హస్తాల ఎదురుచూపులు...
అక్రమ ఆక్రమణలు ఆగేదెప్పుడు... అవినీతి పడగలు నేలకూలేదెప్పుడు...
నుదుటి రాత మారెదెప్పుడు... సగటు మనిషి సంతసించేదెప్పుడు...

No comments:
Post a Comment
Please provide your feedback here.....