పరాకాష్ట చేరిన భానుని ప్రతాపం....
మండే ప్రచండ జ్వాలల నడుమ ప్రాణి కోటి విలాపం....
కొంతమందికే చలిమర గదుల విలాసం..... విహారాల వైభోగం.....
వయసు మళ్ళిన విగత కూలీల శవాలు
మగత కమ్మిన మన నాయకుల స్వార్థానికి సాక్ష్యాలు......
కాలుశ్య మంటల్లో వుడికి పోతున్న పుడమి గ్రీశ్మ తాపానికి విలవిలలాడిపోతోంది....
చిరిగిపోయిన ఓజోను తెర వెర్రి విజ్ఞానాన్ని వెక్కిరిస్తోంది...
అతినీలలోహిత కిరణాలు అమాయక జీవుల అసువులు హరిస్తున్నాయి...
అడుగున దాచుకున్న నీళ్లన్ని ఆవిరైపోతున్నయి..
ప్రసన్న వదన మన ప్రకృతి మాత మన వికృత చేష్టల వలన రక్కసి గా మారుతోంది....
మనం మారకుంటె మన రాబోయె తరం రక్కసి పాలె... అంగారకుని లాగ అవని కూడా ఆరని జ్వాలే...
చలువ చందనాల చంద్రలోకంలో కలువ పందిరికింద కునుకు తీద్దామా...
కడలి అడుగున జేరి అరుణ కిరణ జ్వాలను ఆడ్డుకుందామా....