Monday 11 May 2015

దేవుని చిరునామ...

ఆదినుండి అనంతవిశ్వంలొ అన్వేషణ జరుగుతూనే వుంది..
లెక్కించనలవికాని పాలపుంతలనడుమ పుడమి వైశాల్యమెంత....?
మూడింతల నీటి మధ్యన మట్టి నేల పరిమాణమెంత......?
అతిధిగా అవని చేరిన నీ ఆకారమెంత.....? అవగాహనెంత....?
వసుంధర వయసుముందు నీ ఆధునిక విజ్ఙాన ప్రాయమెంత...? పరుధులెంత....?
అప్పుడే పుట్టిన పురిటి శిశువు విరించిని చూసి వెక్కిరించినట్టున్నాయి విజ్ఙానపు వీచిపలుకులు...
నా వునికిని ప్రశ్నించే ముందు నీ అర్హతను తెలుసుకోవెందుకు.....?
దినకరుని లేత కిరణాలను రెప్పపాటు కాలం వీక్షించలేని నీ తోలు చక్షువులు
కోటిరెట్ల తీక్షణ కాంతి పుంజాన్ని భరించగలవా ...? నన్నుచూడగలవా ...?
నిశ్కల్మష  హృదయం... నా నివాసం ...అకుంఠిత విశ్వాసం దారి చూపె దీపం...
అలుపెరుగని ప్రయత్నం నా దరి చేర్చె నావ ...జ్ఞానికి జగమంతా నా రూపమె..
పసి పాపల పసిడి నవ్వుల్లో ... పూచె పువ్వుల్లో .. మూగజీవుల ఆకలి చూపుల్లో ...
సాధుజనుల సాంగత్యంలో ... సెలయేటి గలగలల్లో... అలల నురుగుల్లో... మలయ మారుతంలో... మమతానుబంధాల్లో..బాదితుల ఆర్ద్రంలో...
అమ్మ ప్రేమలో...  అన్నింటిలోను నేనె...నేను కానిది యేది లేదు...
నిర్వికారం... నిరంజనం...నీ నిర్మల హృదయంమె నా చిరునామ...

No comments:

Post a Comment

Please provide your feedback here.....