పరుగులెడుతోంది చూడు కానరాని కాలచక్రం ...
మనసు విరిచే కలతలెందుకు, మరలిరాదు తరలిపోయిన క్షణం.....
అంతుచిక్కని అగాధమేలేదు అన్వేషించే ఆజానముండాలి....
ప్రత్యేకత లేని ప్రాణే లేదు... గుర్తించే గుణముండాలి...
ఎదిరించే వారంటె విధికైన గౌరవమే...
నిదురమత్తు వీడకుంటె నీ నీడకైన చులకన భావమే...
విషాదమెరుగని ఎడదుండదు..
కొత్త చిగురును చూడని కొమ్మ వుండదు...
చీకటెంత ప్రయత్నించినా ఆపలేదు ప్రభాతకిరణాన్ని...
చేవ గలిగినవాడి చెవి దాటిన బాణం చేదించగలదు లక్ష్యాన్ని...
అలుపెరుగని ప్రయత్నమే అలనాటి వీరుల విజయ రహస్యం...
అలసత్వ ఆవాహనమే అపజయానికి ఆరంభం...
ఆత్మస్థైర్యాని కన్నా మెరుగైన ఆయుధం లెదు... నైరాశ్యమును మించిన శతృవు లేడు...
నిన్ను నువ్వు గుర్తించని నాడు నిఠలాక్షుడు కూడా నిన్ను కాయలేడు....
No comments:
Post a Comment
Please provide your feedback here.....