Monday, 22 June 2015

నిర్భయ...

చట్టాలు ఆపలేవు నిశాచరుల నికృష్ట చేష్టలు....
చౌకబారు చదువులు చూపలేవు సంస్కారపు బాటలు....
అంతర్జాలమందించే అనంత జ్ఞాన సంపదను వదిలేసి
అశ్లీల భరితమైన పక్చిమ సంస్కృతి వైపు పరుగులు తీసి
అదే ఆధునికమనుకునే అధమస్థాయికి  దిగజారింది అజ్ఞాన సమాజం...
వావి వరుసలు లేవు... వయసు విచక్షణలు కానరావు...
పగటి పూటైనా పడతికి ప్రాణ సంకటమే...మాన సంఘర్షణమే...
ఉద్యోగం  చేసె ఉవిద కు దిన దిన గండమే...
విత్త సమూపార్జనే గాని చిత్త శుద్ది నేర్పని విద్యలెందుకు...  మనోవికాసం లేని మనుగడెందుకు..
మానవత్వం నషించిన మనిషి జన్మెందుకు..
పడతిని పుడమి తల్లితో పోల్చిన పుణ్యభూమి మనది...
ఇంతిని ఇలవేలుపుగా కొలిచిన నేల మనది...
నాయకుల అండతో నగర విహారం చేస్తున్నాయి నరరూప మృగాలు...
నానాటికి  పెరిగిపోతున్నాయి నలిగిపోయిన వనితల కళేబరాలు...

No comments:

Post a Comment

Please provide your feedback here.....