Monday, 11 September 2017

పుడమి ఎదపై పూసిన సిరిమల్లెపువ్వు....






పుడమి ఎదపై పూసిన సిరిమల్లెపువ్వు
వినువీధుల్లో విరిసే రంగుల హరివిల్లు
పున్నమి వెన్నెల్లో మెరిసే
నా అందాల పొదరిల్లు

ఊహలకే రెక్కలొస్తే
వొడలు విహంగమైపోదా
వెండి కొండ అంచులపై
హృదయం విహరించి రాదా

స్వర్గాన్ని తలపించే సౌందర్యం తనది
సొగసరి సెలఏటిపై ఆ స్వర్ణకమలం నాది    

Saturday, 26 August 2017

అవసరాల అల్లికే అనుబంధమా....



ఎన్నో ఆశలు ఎన్నెన్నో అవరోధాలు
కన్ను తెరిచింది మొదలు
ఆక్రందనలు ఆవేశాలు ఆరాటాలు
అపురూప అనుభూతుల జ్ఞాపకాలు

అక్కరకు రాని చుట్టరికాలు
అక్కునజేర్చుకునే స్నేహాలు
ఒకరికొకరు దూరమయ్యే గడియలు
ఓర్చుకోలేని బాధలు

కన్నీటి  కడలిలో ప్రయాణం   
కలతల అలల కర్మయోగం
కనిపెంచిన వారి తాపత్రయం
కాటికి చేరే వరకు తీరని దాహం

అవసరాల అల్లికే అనుబంధమా
అవని రంగస్థలం పై అంధుల నాటకమా   

Saturday, 12 August 2017

Fantasy Love (Special poetry in English)

There was a boy.. and.. there was a girl...

The boy was a Panther chasing wild dreams...
The girl was a deer, dreaming mild love...

He was roaring on a bright day in the mountains of cloudy world...

She was there watching him like a sun of thousand wonders....

She held a smile of a crescent moon and hit him with the arrow of love...
He saw her in the shadows of a dark world like a star Twinkling for him....

He spread his arms wide and asked her to fill his heart...

She raised high in the sky and gave him the kiss of a rose..And she whispered in his ears , 'I am yours now, and let me make you mine...'

He hugged her close to heart and replied with a kiss on her forehead.. 'I am you and there is no me'...

He made her his wildest dream and she just entered his heart and enjoyed his infinite love...

They held their hands and flew into the valleys of dark sprinkling the sparkles of their love, lighting every particle in their path....

They flew through the oceans of the world, adding the sweetness of their memories...

They flew through the skies of void filling with the stars of hope...

They reached the top of the universe and their eyes spoke to each other..
'We are one forever.. ' .......

Friday, 11 August 2017

ఎదురుచూపుల ఎడద మరోసారి మోసపోయె ....






అన్నపూర్ణలకు పుట్టిల్లు నాది
కొహినూరును కన్న కనక ధరణి నాది
రాయలేలిన రత్నగర్భ నాది
అవినీతి చెరలో నలుగుతున్న నేల నాది

కౌటిల్యుని అర్థశాస్త్రం కడుపు నింపదాయె
అశోకుని అభివృద్ది పదం ఆదిలోనో ఆగిపోయె
ఎదురు చూస్తున్న రామ పాదము ఏనాటికి రాదాయె
కన్నీటి కొలనులో కలలన్నీ కరిగిపొయె

దొరల దహనకాండలో దరహాసము ఆవిరాయె
దాచుకున్న శ్రమసంపద దానవుల పాలాయె
ఎల్లలు దాటిన మన కలిమి ఎక్కడుందో తెలియదాయె
ఎదురుచూపుల ఎడద మరోసారి మోసపోయె

ఏళ్ళు గడుస్తున్నా ఎదుగుతున్న దేశమేనా
ఎరుపు రంగు మరకల బడుగు బ్రతుకులేనా

Friday, 21 July 2017

ఎవరు గీసిన చిత్రాలు...


హరివిల్లు వర్ణాలు
అరుణోదయ కిరణాలు
ఎరుపెక్కిన గగనాలు
ఎవరు గీసిన చిత్రాలు

అందమైన మనసుంటే
అడుగడుగునా ఆనందాలే
ఆలకించే తీరికుంటే
అణువణువు ఆమని ఋతురాగాలే

ఎల్లలులేని ఆకాశం
ఎనభైనాలుగు లక్షల సంతానం
అనుబంధాల చిద్విలాసం
అంతుచిక్కని ఆరాటం

మలచిన శిల్పి ఎవ్వరో
తన మది ఎంత మృదువో
అథిది గృహమే అద్భుతమైతే
అసలు పుట్టిల్లు మరెంత మనోహరమో

Saturday, 8 July 2017

నిన్నల్లో కలసి పోయావు.....


కలలాంటి నీ చెలిమి
క్షణమైనా మరువలేకున్నా  
మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ
మదిలోనే కుమిలిపోతున్నా

నా మనసు పిలుపుకు అందనంత దూరం
నక్షత్రాల నడుమ నిలిచింది నీ స్నేహం
నిట్టూర్పుల నీడల్లో వెతుకుతున్నా నీకోసం
నెమరేసుకుంటూ నీ జ్ఞాపకాల తీయని గతం

నాతోనే బ్రతుకన్నావు
నా బ్రతుకే నువ్వయ్యావు
నయనాల బాసలు మరచి
నిన్నల్లో కలసి పోయావు

ఆనంద గీతిక ఆవిరైపోయే
అలసిన మనసేమో నా మాటవినదాయె...

Saturday, 1 July 2017

మనదన్న మాటతో కలసి బ్రతకలేమా



నీదీ నాదన్న తగువెందుకు నేస్తమా 
మనదన్న మాటతో కలసి బ్రతకలేమా
నేలను పంచుకున్నా తీరని దాహమా
నెత్తుటి మడుగుల్లో పైశాచిక నృత్యమా

దేశాన్ని చీల్చావు
ధరణి రంగు మార్చావు
దైవాన్ని కూల్చావు
దానవరాజ్యానికి తెరదీశావు

అలనాటి వైభవం
అరుణోదయమై అరుదెంచేనా
అన్నదమ్ముల నడుమ
అనురాగ విరి విరిసేనా

ఇటుక ఇటుక పేర్చి
ఇళ్ళెన్ని కట్టుకున్నా
విధి పిలుపు రాగానే
వదలి వెళ్ళక తప్పదన్నా


Wednesday, 21 June 2017

నిరాశ నీడలో నీకోసం బ్రతికున్నా ...


నువ్వెక్కడున్నా నీతోనే నేనున్నా
నీలోని ప్రతి అణువు నేనే అనుకున్నా
నిరాశ నీడలో నీకోసం బ్రతికున్నా
నెలవంక సాక్షిగా నేలా నింగి నడుమ

కోయిలమ్మ పాడుతోంది
నీ పలుకులను నెమరేస్తూ
నా గుండెను పిండుతోంది
కొన ఊపిరి లాగేస్తూ

మరుపన్నది లేకుంటె
మనిషి బ్రతుకు నరకమే
మది మెచ్చిన తోడుంటే
మహాప్రస్థానమైనా మధురమే

తెలియ్తలేదు నాకు
తెరచాప తొలగిందని
ఉసురు తీసే కడలిలో
ఒంటరినైపోయానని

Friday, 16 June 2017

మనిషి మనిషికొ దేవుడాయె...


చరిత సారమంతా
పరపీడన కథలాయె
బంగారు భరత భూమి
బానిసల నెలవాయె

మానవజాతి ఒక్కటే అయినా
మనిషి మనిషికొ దేవుడాయె
మతాల మారణహోమంలో
మానవత్వం బూడిదాయె

అన్నదమ్ముల నడుమ
ఆరని చిచ్చు రగిలె
ఒక్కటిగా ఉన్న జాతి
ముక్కలుగా విడిపోయె

దేవుళ్ళ ముసుగుల్లో
దెయ్యాల కొలువాయె
దీనుల జీవితాలు
దిన దిన గండమాయె

Saturday, 10 June 2017

అనురాగ రాగమై ....



నింగి నేల కలిసే చోట
నీ రాకకోసం వేచి వున్నా
ఎదురుచూపులవేడిలో
ఎడద కరిగిపోతున్నా

చల్ల గాలి చెబుతోంది
నీ ఊసులెన్నో
మౌనంగా పంచుకున్న
మన బాధలెన్నో

కరిగిపోని కలవై
నాకళ్ళళ్ళో నిలిచిపోవా
అనురాగ రాగమై
కలకాలం మురిపించవా 

Thursday, 8 June 2017

రుధిర ఋణానుబంధాలనైనా....


తేనె పలుకుల పలకరింపులు
తెర వెనుక గోతులు
ఎదుట మదిగెలిచే మాటలు
ఏరుదాటాక వెక్కిరించే నక్కలు

రెప్పపాటు కాలంలో
రూపాలెన్నో మార్చే నైపుణ్యం
రుధిర ఋణానుబంధాలనైనా
రూపాయితో కొలిచే దానవగుణం

ధనార్జన దాహంతో
జనార్ధనుడినే మోసగిస్తారు
సుఖ సంపాదనల వేటలో
సగటు మనిషిని వదిలేరా... 

Thursday, 1 June 2017

కలల మేఘాల వెనుక...

పరుగిడకే మనసా
కలల మేఘాల వెనుక
కురిసే ప్రతి చినుకూ కావాలంటూ
మెరుపు కాంతిలో సందడిజేస్తూ

పసిడి పలుకుల తళుకుల్లో
పరవషించిపోతావు
పడగ విప్పి బుసగొట్టిన రోజు
పండుటాకులా వణికిపోతావు

చిన్ని చిన్ని సంతోషాలు
చిలిపి తగవుల చిరునవ్వులు
చెరిగిపోయే అనురాగాలు
చేదు అనుభవాల జ్ఞాపకాలు

ఇవేనా నీ ఆరాటాలు
ఇంతేనా అనుబంధాల లెక్కలు

Thursday, 18 May 2017

కడదాక తోడొస్తావా నేస్తం....






నవ్వే నీ కళ్ళు నావె
నవరాగాల నీ పలుకులు నావె
జిలిబిలి తగువులు నావె
జీవన సమరాలూ నావె

జతగా వేసిన అడుగుల్లో
జడివానల మజిలీలెన్నో
జగమంతా దగాచేసినా
జడవక నిలిచిన క్షణాలెన్నో

మలిసంధ్యల చీకట్లో
ముసురేసిన మబ్బుల్లో
కడదాక తోడొస్తావా నేస్తం
కలిసి చేరుకుదామా మరో లోకం

గగనపు వీధుల్లో విహరిస్తూ
మరుజన్మల ఊహల్లో తేలిపోతూ

Wednesday, 10 May 2017

మల్లెల మనసుల మధుర స్వప్నం....


చేయి చేయి కలిపి నిర్మిద్దాం
నేతాజి కలల నవలోకం
మల్లెల మనసుల మధుర స్వప్నం
మహాత్ముని మరో ప్రపంచం

అందాలు ఆరబోసిన అపరంజి సౌధమది
ఆకలి కేకలుండవు
జిలుగు తారల వెలుగు సంద్రమది
అసూయా ద్వేశాల కానరావు

వేటాడే నాయకుల వెర్రిచేష్టలుండవు
కళ్ళల్లో కసాయి కుర్రతనముండదు
నిర్భయ నైమిశ రోదనలుండవు
వెట్టి చాకిరీ వ్యధల బాల్యముండదు

మతకలహాల మారణహోమం మానుకుందాం
మనీషి లా మానవత్వాన్ని చాటుకుందాం

Friday, 28 April 2017

చీకటికి ఉనికెక్కడిది నేస్తం....


ఆశనిరాశల అల్లికలే జీవితాలు
మమకారాలన్నీ మాటల మూటలు
అందారూ నీవాళ్ళే అనుకుంటే చాలు
మనసంతా సుగంధ పరిమళాలు

చీకటికి ఉనికెక్కడిది నేస్తం
వెలుగింకా రాలేదన్నదే నిజం
తెలియనిదంతా తిమిరమే కదా
తెలుసుకున్న రోజు తన్మయమే కాదా

నిరాశను జయించిన నాడు
నింగి నీకు తలవంచదా
ఆత్మ విశ్వాసం అంబరమైతే
కురిసే ప్రతి చినుకు అమృతం కాదా

Thursday, 20 April 2017

వేషాలు వేరైనా రుధిర వర్ణం ఒక్కటే .....






కలిచే వేదన ఎవ్వరిదైనా
కన్నీటి చుక్క వెచ్చనేగా
రారాజుకైనా రహదారి బిక్షగాడికైనా
వెన్నెల దీపం చల్లనేగా

నింగికెగిరేదాకా నీ భారాన్ని మోసే
నేల తల్లినడుగు నీ కులమేదని
గతితప్పని గమనంతో నీ ప్రాణాన్ని నిలిపే
గాలి కెరటాన్ని అడుగు నీ కులమేదని

రోదిస్తోంది ప్రకృతి
నిను కన్నందుకు సిగ్గుపడి
రగిలిపోతోంది ప్రళయమై
నీ అజ్ఞానానికి మండిపడి

వర్ణమేదైన వల్లకాడు ఒక్కటే
వేషాలు వేరైనా రుధిర వర్ణం ఒక్కటే

Wednesday, 12 April 2017

కరిగే ప్రతి క్షణం కావ్యమై నిలిచిపోదా ....






ఒడుదుడుకుల కడలిలో
ఎగసిపడే అలల తాకిడిలో
జతకలిసిన నేస్తం నువ్వు
ఎన్నోజన్మల తోడు నీ నవ్వు

మనసు మగత మౌనంలో
మమతల మధుర సడి
ఎదలయలో కలిసిపోయే
నీ ఇరు శ్వాసల చిరు సవ్వడి

కనులముందు నువ్వుంటే
కాలమే ఆగిపోదా
కరిగే ప్రతి క్షణం
కావ్యమై నిలిచిపోదా

Monday, 10 April 2017

ఒంటరిగా పోరడనివ్వు నా ఊపిరాడేవరకు ....


నీకు పట్టనట్టే మసలుకోరా
వగచే జీవితాలు వల్లకాడుజేరేవరకు
నరమేధం జరుగుతున్నా ముసుగుదన్ని నిదురపోరా
వేదన పక్క వాడిది కదా వులికిపాటు నీకెందుకు

మలి వరసలో నీవున్నా
మరో రోజు నీ వంతైన
ఆదుకోవడానికి వున్నారుగా
నువు ఆరాధించే దేవుళ్ళు

పైవాడి పై భారమేసి
ప్రతిఘటన ఊసెత్తకు
పెరుగన్నం నైవేద్యం పెడితే రాడా
పరుగులు పెడుతూ పెరుమాళ్ళు

దీటైన దానవులను వోటేసి ఎన్నుకో
దమన దహనకాండలో సమిధవై వెలిగిపో
ప్రళయ మారుతంలో గడ్డి పరకవై ఎగిరిపో
ప్రశ్నించే గుణం మరచి చరిత్రలో కలిసిపో

గంటకో గండం తలుపుతడుతున్నా
గొంతు విప్పే శ్రమ నీకెందుకు
నాతో చేయి కలపకురా చేవజచ్చిన నేస్తమా
ఒంటరిగా పోరడనివ్వు నా ఊపిరాడేవరకు

Monday, 20 March 2017

ఎద లోయల జలపాత రాగమా...


చల్లని గాలితో చేయిగలిపి
చినుకు చేస్తోంది సవ్వడి
చెలి కాలి మువ్వలా
గగన గాంధర్వ గీతంలా

సొగసరి మేఘం గర్జిస్తోంది
సొమ్మసిల్లిన జగతిని సేదదీరమంటూ
గ్రీష్మ భాస్కరుణ్ణే కప్పేస్తోంది  
ఘాటైన తాపాన్ని తగ్గించమంటూ

ఇది గడసరి సరసమా
మది పులకరింతల పరవషమా...
ఎద లోయల జలపాత రాగమా
ఎగసి పడే అలల ఆనంద దరహాసమా....


Friday, 10 March 2017

నా ఎద దాహం తీర్చావు... నీ హృదిలో నను దాచావు

ఎన్నోజన్మల స్నేహ సమీరం
నను తాకిన ఆ క్షణం
ఎలా మరువగలను నేస్తం
నీ కిలకిల నవ్వుల ఆ నవనీతం

వాడిన విరి తోటలా
ఒంటరిగా నేనుంటే
వాన చినుకు కోసం
వేయి కళ్ళతో ఎదురుచూస్తూంటే

వినీల మేఘ జలపాతంలా
వడివడిగా నేల జారి
విధి రాతల క్రీడల్లో
వేసారిన నను జేరి

నా ఎద దాహం తీర్చావు
నీ హృదిలో నను దాచావు 

nA eda dAham tIrchAvu... nI hrudilO nanudAchAvu








ennOjanmala snEha sameeram
nanu tAkina A kshaNam 
elA maruvagalanu nEstam
nee kilakila navvula A navaneetam

vADina viri tOTalA
onTarigA nEnunTE
vAna chinuku kOsam
vEyi kaLLatO eduruchUstUnTE 

vineela mEgha jalapAtamlA
vaDivaDigA nElajAri
vidhi rAtala kreeDallO 
vEsArina nanujEri

nA eda dAham tIrchAvu
nI hrudilO nanudAchAvu


Wednesday, 22 February 2017

మట్టి మరకల మేనుకు ఎన్ని గంధాలో ...






వినోదానికి కొదవలేదు
విపరీతాలకు అదుపులేదు
విపణి వీధుల్లో మేధావుల సమరాలు
విధి రాతల వింత నాటకాలు

రూపాయి కోసం రూపాలెన్ని మార్చినా
రాజ్యాలు కూల్చైనా రాసులుగా పోగేసినా
రేయనక పగలనక కాపుగాసినా
రేణువు అణువైనా నేవెంట వచ్చేనా...

నిను చూసి నవ్వుతోంది నీలి మేఘమాల
నీవూ నేనూ ఒకటేనంటూ
కరిగే వరకే కలిమిలేముల హేల
కనుమూసిన వేళ నీతో అవి కలిసిరావంటూ

మూణ్ణాళ్ళ ముచ్చటలో ఎన్ని బంధాలో
మట్టి మరకల మేనుకు ఎన్ని గంధాలో 

maTTi marakala mEnuku enni gandhAlO ....






vinOdAniki kodavalEdu
viparItAlaku adupulEdu
vipaNi vIdhullO mEdhAvula samarAlu
vidhi rAtala vinta nATakAlu

rUpAyi kOsam rUpAlenni mArchinA
rAjyAlu kUlcainA rAsulugA pOgEsinA
rEyanaka pagalanaka kApugAsinA
rENuvu aNuvainA nEvenTa vacchEnA...

ninu cUsi navvutOndi nIli mEghamAla
nIvU nEnU okaTEnanTU
karigE varakE kalimilEmula hEla
kanumUsina vELa nItO avi kalisirAvanTU

mUNNALLa muccaTalO enni bandhAlO
maTTi marakala mEnuku enni gandhAlO  

Wednesday, 15 February 2017

నీ కురుల చాయల్లో కడశ్వాస విడవాలని ...







తొలినాటి స్నేహానికి మమకారాన్ని మేళవించి
తిమిరంతో సమరంలొ తోడుగా నిలచి
నీలాల ధారల్లో నీ ప్రేమనే దాచి
నువు విసిరిన ఆ చూపును ఎలా మరువగలను
నీ చెలిమికి దూరంగా నే బ్రతకలేను

కలిమీ లేముల్లో కోరేది ఒక్కటే
నా మనసంతా నువ్వై
నను నేను మరవాలని
నీ మమతంతా నాదై
నింగిలో తేలిపోవాలని

కలికి వెన్నెల్లో నీతో కలిసి నడవాలని
నీ కురుల చాయల్లో కడశ్వాస విడవాలని 

nI kurula cAyallO kaDaSvAsa viDavAlani...








tolinATi snEhAniki mamakArAnni mELavinchi
timirmtO samaramlo tODugA nilachi
nIlAla dhArallO nI prEmanE dAchi
nuvu visirina A cUpunu elA maruvagalanu
nI celimiki dUrangA nE bratakalEnu

kalimI lEmullO kOrEdi okkaTE
nA manasantA nuvvai 
nanu nEnu maravAlani
nI mamatantA nAdai
ningilO tElipOvAlani

kaliki vennellO nItO kalisi naDavAlani
nI kurula cAyallO kaDaSvAsa viDavAlani

Tuesday, 7 February 2017

చలించలేదా నీ మనసు....


అర్దరాత్రి స్వాతంత్ర్యం అనుభవిస్తున్నదెవ్వడో
ఆకలి సెగల ఆర్తనాదం మాత్రం నాదే
ఆదమరచి నిదురించే అవినీతిపాలకులెక్కడో
అసమర్థుల ప్రసవ పాపం మాత్రం నాదే

వృద్ధాప్యం వణుకుతోంది
చావుకోసం ఎదురుచూస్తూ
చలించలేదా నీ మనసు
చాచిన నా చేతిని చూసి

చెడబుట్టావుకదరా నా కడుపున
చేతగాని తనయుడా
చీడ పురుగుల సైన్యంతో
చేయిగలిపిన రాక్షసుడా

ఎవ్వడురా నిను మనిషన్నది
ఎప్పుడురా నువు మేల్కొనేది

chalincalEdA nI manasu....






ardarAtri svAtantryam anubhavistunnadevvaDO
Akali segala ArtanAdam mAtram nAdE 
Adamarachi nidurinchE avinItipAlakulekkaDO
asamarthula prasava pApam mAtram nAdE

vRddhApyam vaNukutOndi
chAvukOsam eduruchUstU
chalincalEdA nI manasu
chAcina nA chEtini chUsi

cheDabuTTAvukadarA nA kaDupuna
cEtagAni tanayuDA
cIDa purugula sainyamtO
cEyigalipina rAkshasuDA

evvaDurA ninu manishannadi
eppuDurA nuvu mElkonEdi

Saturday, 28 January 2017

అలసిసొలసిన నా కళ్ళు మూసి

అక్షరానికి అందనిది
అమ్మా నీ అనురాగం
కలతలెరుగని నిదురనిచ్చిన
నీ ఒడి వెచ్చదనం

వేలుపులైన వెలకట్టలేనిది
నీ మమకార హరిచందనం
వేవేల జన్మలెత్తినా
తీర్చగలనా తల్లీ నీ రుణం

కష్టాల కడలిలో
కడదాకా పయనించావు
తీరంజేరేనాటికి తెరమరుగయ్యావు
తిరిగిరాని లోకాలకు తరలిపోయావు....

ఎలా వెళ్ళగలిగావమ్మా
ఒంటరిగా నను ఒదిలేసి
నన్నెప్పుడు తీసుకెళతావమ్మా
అలసిసొలసిన నా కళ్ళు మూసి  

alasisolasina nA kaLLu mUsi






aksharAniki andanidi
ammA nI anurAgam
kalatalerugani niduranichina
nI oDi veccadanam

vElupulaina velakaTTalEnidi
nI mamakAra haricandanam
vEvEla janmalettinA
tIrcagalanA tallI nI ruNam

kashTAla kaDalilO
kaDadAkA payaninchAvu
tIramjErEnATiki teramarugayyAvu
tirigirAni lOkAlaku taralipOyAvu....

elA veLLagaligAvammA
onTarigA nanu odilEsi
nanneppuDu tIsukeLatAvammA
alasisolasina nA kaLLu mUsi 

Monday, 16 January 2017

venTADE nee chUpuku chikkina A tolirOjulu...



neelimEghAla sAkshigA
kurisE jaDivAna pandirilO
taDisina tanuvunu maracipOyi
nIkOsam educhUsina A madhura kshaNAlu

vEvEla anubhutula alanATi jnApakAlu
venTADE nee chUpuku chikkina A tolirOjulu
nimIlikA nayanAla vinipinchani gusagusalu
nIrAkanu telipina pillagAli parimaLAlu

kaLLu kalavarapaDutunnAyi nEstam..
         kala chedaripOtundEmOnani
vEDukunTunnAyi pratikshaNam
          kadilE kAlAnni Agipommani

వెంటాడే నీ చూపుకు చిక్కిన ఆ తొలిరోజులు....






నీలిమేఘాల సాక్షిగా
కురిసే జడివాన పందిరిలో
తడిసిన తనువును మరచిపోయి
నీకోసం ఎదుచూసిన ఆ మధుర క్షణాలు

వేవేల అనుభూతుల అలనాటి జ్ఞాపకాలు
వెంటాడే నీ చూపుకు చిక్కిన ఆ తొలిరోజులు
నిమీలికా నయనాల వినిపించని గుసగుసలు
నీరాకను తెలిపిన పిల్లగాలి పరిమళాలు

కళ్ళు కలవరపడుతున్నాయి నేస్తం..
         కల చెదరిపోతుందేమోనని
వేడుకుంటున్నాయి ప్రతిక్షణం
          కదిలే కాలాన్ని ఆగిపొమ్మని 
 

Friday, 6 January 2017

వెండి వెన్నెల వెలుగుల్లో విరి వాన జల్లు లా ....

వెండి వెన్నెల వెలుగుల్లో
విరి వాన జల్లు లా
వెంటాడుతోంది ప్రతి నిమిషం
నులివెచ్చని నీ మందహాసం

మేఘ గమనంలో నీవే
మెరుపు గీతల్లో నీవే
కలల్లో నీవే కలవరింతల్లో నీవే
కంటి వెలుగూ నీవే కటికచీకటీ నీవే

నూరేళ్ళ ఈ జీవితం
ఎదురుచూపలకే అంకితమా
మరుగైపోనా ఈ క్షణం
మరుజన్మకిచ్చిన మాటకోసం.. నేస్తమా

venDi vennela velugullO viri vana jallu lA

venDi vennela velugullO
viri vana jallu lA
venTAdutOndi prathi nimisham
nulivecchaani nee mandahAsam

mEgha gamanamlO neevE
merupu geethallO neevE
kalallO neevE kalavarintallO neevE
kanTi velugU neevE kaTikacheekaTI neevE

nUrELLa ee jeevitam
eduruchUpalakE ankitamA
marugaipOnA ee kshaNam
marujanmakichina mATakOsam.. nEstamA