అవని ఒడిలో విప్లవ కేసరి కలిసిపోయిన రోజు
తెల్ల దొరల కుటిల నీతికి నేల తల్లి తల్లడిల్లిన రోజు
తెలుగు బిడ్డ రక్తంతో భరతమాత తిలకం దిద్దుకున్న రోజు...
అల్లూరి విల్లు నేలకొరిగిన రోజు...సీతారామరాజు తరలిపోయిన రోజు...
వీర కేసరిని విస్మరించిన నల్ల దొరలకు గుర్తుచేద్దామా...
విలువలెరుగని కపట నాయకులను తరిమిగొడదామా...
విగత వీరుని స్మరణలో రుధిర భాష్పం ధారపోద్దామా...
చరణ ధూళిని తలనురాసుకుందామా... ధరణి దద్దరిల్లేలా జేజేలు కొడదామా..
No comments:
Post a Comment
Please provide your feedback here.....