Monday, 21 December 2015

హ్యాపి డేస్...

కాలేజి రోజులంటే గిలిగింతల సరాగాలేకదా...
కమనీయ అనుభూతులు.. కవ్వించే కయ్యాలు...
తిరిగిరాని తియ్యదనాలు...  చెరిగిపోని జ్ఞాపకాలు...
గద్దించే గరిమల నడుమ గెలుపోటముల సమాగమాలు..   

ఉరకలేసే ఉత్సాహం.. మైమరిపించే వినోదాల సమాహారం...  
సహచరుల చిద్విలాసాలు.. సమయమెరుగని సయ్యాటలు...
అదుపుతప్పిన అల్లరిమూకల చిలిపిచేష్టలు
ఆగ్రహించిన అధ్యాపకుల మందలింపులు

మరచిపోలేని క్యాంటీను ముచ్చట్లు... 
విదూషక మేధావుల సుదీర్ఘ చర్చలు...
ఆముదాలవలస సమస్యలనుండి...
అమెరికా ఆర్థిక ప్రగతి వరకు...

చంటి గాడి పరిణయ వ్యవహారాల నుండి...
చలం నవలా రమణీయత వరకు... 
అన్ని అజెండాలు మావె.. ఆలకించేవాళ్ళూ మేమే...
సమస్యలన్నీ మావె.. పరిష్కర్తలు మేమే..

చలి చీకట్లలో వెలిగించిన క్యాంప్ఫైర్లు...
క్రీడాసందళ్ళలో గడిపిన సంబరాల క్షణాలు.. 
వినువీధిన ఎగరేసిన విజయ కేతనాలు..  
వీనులవిందైన కరతాళ ధ్వనులు... 

గడచిపోయిన ఆ ఆనంద ఘడియలు తిరిగిరావెందుకు...
కులమతాలు పట్టించుకోని కమనీయ స్నేహాలేమయినాయి...
మమతానుబంధాల మామాఅళ్ళుళ్ళ వరసలు వినిపించవెందుకు..
కరిగిపోయిన కలలు మళ్ళీ పలకరించవేమిటి...

Wednesday, 16 December 2015

మనసా... మారవెందుకే....

అదుపెరుగని పరుగెందుకే అంతుచిక్కని మనసా...
భాష మౌనమేగాని భావనలతో భయపెడతావు...
అందరూ నీవాళ్ళే అనుకుంటావు హద్దులు చెరిపేసుకుంటావు... 
అనుబంధాల నడుమ నలిగిపోయి నవ్వులపాలవుతావు...

గగనమే హద్దుగా ఆత్మీయతను ఆశిస్తావు...
జగమంతా నీలాంటిదేనని నమ్మి చెడతావు...
గాయపడిన క్షణాన మౌనంగా రోదిస్తావు...
కలలెంతమంచివయినా కళ్ళుతెరిచేవరకేనని తెలుసుకోవు...

చేసిన పొరపాట్లు మరచి చెలిమి సాగిస్తావు...
గతించిన గాధలు గుర్తుండవానీకు...
మార్గమెంత క్లిష్టమైనా మరలిరానంటావు...  
అనుభవించిన క్లేశము మరచిపోతావెందుకు...  

చెరిపేసిన జ్ఞాపకాలను నెమరేసుకుంటావు 
మరగించే గాయాన్ని మాసిపోనియ్యవెందుకు...
తెలియని లోకాల్లో షికార్లు చేస్తావు
కల కరిగిపోగానె కన్నీరవుతావెందుకు..

కపటాశ్రువులకు కరగిపోతావెందుకు... 
తలపుల్లోనే వగచి కడదేరుతావెందుకు...
 

Friday, 11 December 2015

మేధావులార మేలుకోండి .....


అవసరాల పేరుతో అవనినే తాకట్టు పెడతామా...
అభివృద్ది మత్తులో మన ఉనికినే తగులబెట్టుకుందామా...
మితిమీరి మండిస్తున్నాము మోటారు ఇంధనం
మలినమైపోతోంది మన అందమైన విశ్వం...

శాస్త్రీయత లోపించిన కర్మాగార నిర్వాహణలు...
సెలఏరులై పారుతున్న పారిష్రామిక వ్యర్థాలు...
నిజాయితి లేని అధికారుల నిర్వాకాలు...
ఇల ఎడద లో ఇంకిపోతున్న రసాయన ప్రవాహాలు...

జీవం కోల్పోతున్న జీవనాధార నదీ జలాలు..
జవసత్వాలుడిగిన జనచైతన్య సంఘాలు... 
కనుమరుగైపోతున్న కమనీయ జీవరాశులు...
గాలిలో పెరిగిపోతున్న గరళ ఝరి అలలు

ఊపిరందని స్తితిలో బాదిత జీవులు...
నిమ్మకునీరెత్తినట్లున్న నిర్జీవ ప్రభుత్వాలు...
వేడెక్కుతోన్న విచలిత వసుంధర
కరిగిపోతున్న శ్వేత శైల పరంపర...

చెట్టు కొట్టేవాళ్ళేగాని నాటి పెంచేవాళ్ళెక్కడ...
మట్టిని నమ్ముకున్న వాళ్ళకు మంచిరోజులెప్పుడు...
గట్టి మేలు తలపెట్టే జట్టి నాయకులెవరు...
మెట్టు దిగని బడాబాబుల మెడలువంచేవాళ్ళెవరు... 

ఆలకించని అసురచేష్టల అగ్రదేశాలు
దడియు వేగంతో దగ్దమవుతోన్న హరిత వనాలు...
హెచ్చరిస్తున్న క్రోధిత కడలిజలాలు..
అంబుధి అంచున హడలిపోతోన్న బడుగు రాజ్యాలు...

కూర్చున్న కొమ్మను నరుక్కునే కుటిల రాజనీతి మారదెందుకు...
మనిషి మనుగడను కోరని మేధావులు మనకెందుకు...  

Sunday, 29 November 2015

అవినీతి వరద.... అంధకార ఎడద

 ప్రకృతి పలకరించిన క్షణం  తనువంతా పరవశం...
పళ్ళుకొరికిని దినం ప్రళయ ఝరిలో విలీనం...
కన్నెర్ర జేసిన కాలమేఘం...  జడివానల నడుమ జనసందోహం...
కానరాని నిగమచాయలు... నడి ముంగిట్లో పలకరిస్తున్న మురికి కాలువలు...
నేరమెవరిది నిఠాలాక్షా... సామాన్యుడికేనా నిరంతరమూ పరీక్ష....
డ్రైనీజిల పైన దర్షనమిస్తాయి ధనవంతుల కట్టడాలు...  
దారితెలియని వరద జలాలకు రహదారులే చిరునామాలు...
                                            పడవలే ప్రధాన వాహనాలు...
వంటకు వనరులు లేవు... కంటికి నిదురలేదు...
                                          కడుపు మంటకు ఊరట లేదు...
సర్పాల బెదిరింపులు... అంధకార రాత్రులు...
కూలిపోతున్న గోడలు... రాలిపోతున్న ప్రాణాలు....
పసిపాపల ఆకలి కేకలు... కన్నవాళ్ళ అరణ్య రోదనలు...
నీళ్ళ మధ్యనే జీవనం... కన్నీళ్ళతోనే తీర్చుకోవాలి దాహం... 
ఎన్నాళ్ళీ పోరాటాలు...  ఆపన్న హస్తాల ఎదురుచూపులు...
అక్రమ ఆక్రమణలు ఆగేదెప్పుడు... అవినీతి పడగలు నేలకూలేదెప్పుడు...
నుదుటి రాత మారెదెప్పుడు... సగటు మనిషి సంతసించేదెప్పుడు...   

Saturday, 21 November 2015

మా పల్లె...


చిరుజల్లుల మేఘమాలమేనికెంతమెరుపో...
చినుకు తాకిన పూలరెమ్మకు ఎంతపులకరింపో....
పిల్లగాలుల చిలిపి పలకరింపుతో..  
            మెల మెల్లగా కళ్ళు తెరుస్తోంది మాపల్లె, మగతవీడి......
కోకిలమ్మల శ్రావ్య సంగీతంతో...
            సృతి కలుపుతోంది గిత్త గరళ గజ్జెల చిరు సవ్వడి...
పచ్చని పంట పొలాలు... పొచ్చెమెరుగని పసిడి మనసులు... 
లేత తామరాకు పై కదులుతున్న నీటి చుక్కలు....
హరిత శాఖల నడుమ చిలకల కిలకిలలు...
లలితమయమైన సుందర నందనవనాలు...
గుడిగంటల గణగణలు...
ప్రార్థనా గీతాల సరిగమలు...
మిసిమి నురుగుల సెలయేటి చప్పుళ్ళు...
పొదుగు కొసం లేగదూడల పిలుపులు...
కడుపునిండిన కోడె గిత్తల చిందులు....
ఆదిచూసి ఆనందిస్తున్న గోమాతల గంభీర వదనాలు...
గోధూళి వేళకు రచ్చబండ చెప్పే గుసగుసల ముచ్చట్లు...
ఆడుగడుగునా పరవళ్ళుతొక్కే స్వచ్చమైన చిరునవ్వులు...
కపటమెరుగని పలకరింపులు... కమనీయ స్నేహాలు...
సనాతన సంస్కారాన్ని వీడని వావివరసల తుంటరి చేష్టలు...
ఆత్మీయతలే ఆస్తులుగా మసలుకొనే మమతల లోగిళ్ళు...
అందరిని ఆదరించే ఆనందాల వని...
అమ్మవడిని తలపించే అమృతవర్షిణి ... మాపల్లె... గోపాలుని రేపల్లె...

Friday, 6 November 2015

దీపాల వెల్లి... దీపావళి...


దివినుండి దిగివచ్చె కోటి దివ్వెల తల్లి దీపావళి...
దిక్కులన్ని వెలిగించె చిరునవ్వులు వెదజల్లి...
ఎటుచూసినా సంబరాల సందడి... మమతానురాగాల వొరవడి...
కళ్ళు చెదిరే కాంతుల నడుమ పసి పాపల పరవళ్ళు...
కన్నవారి కళ్ళల్లో కదలాడే అనంద బాష్పాలు.... 
ఇన ప్రభను తలపిస్తూ అవని వెలిగి పోతోంది...
చిన్నబొయిన చీకటమ్మ నిలువ చోటులేక చెదరిపోయింది...  
చిటపట చప్పుళ్ళ సరిగమలు.. చిలిపి చేష్టల మధుర క్షణాలు...
పసిడి వన్నెల పందిరిలో ప్రకాశిస్తోంది రిక్కదారి... 
జిలుగు వెలుగుల చీరకట్టి మెరిసిపోతొంది అమావాస్య రాతిరి... 
చెడును చీదరించుకొని తరిమివేస్తే... మంచిని చేరదీసి మసలుకుంటే  
ప్రతిరోజు దీపావళే... పరవశాల పదనిసలే.... 

Thursday, 29 October 2015

నా శూన్య బంధాలు...

నువ్వెన్నిసార్లు నయవంచన చేసినా నమ్మటమే నాకు తెలుసు 
నీ చిరునవ్వు కోసం మోసపోవడంలోని సుఖం నీకేం తెలుసు... 
అనుబంధాలు ఆవిరై పోతాయని తెలిసినా అనుక్షణం ఆరాటమే....
                        ఆత్మీయతల నడుమ అలుపెరుగని పోరాటమే...
నింగికెగసే వరకు తెలియదు నేలవిలువెంతో...
                                                             వియోగ వేదనేమిటో...
మాడిపోతానని తెలిసినా మిణుగురుకు మంటలంటెనే మక్కువ...
                              మారిపోయె మనుషులకు మమతానుబంధాలంటే లోకువ...
సెలయేటికి స్వార్థముందా నేస్తం..... గల గల పారే గుణమేగాని.... 
                                చిరుగాలికి  పర  సేవలోనే సుఖం... ప్రతిఫలం రాకపోని...
పంచభూతాల ప్రతిరూపమే నేనైనప్పుడు.. క్షణిక తాపాల తిమిరం నాకెందుకు...
అణువణువున  అలుముకున్న అనురాగ సంపద నాది కాదా... నీది కాదా..
పంచే గుణమే మనదైతే ప్రపంచమే మనది కాదా... మనసు పరవశించిపోదా....

Tuesday, 20 October 2015

గుర్తున్నానా నేస్తం...

బ్రతుకు పుస్తకం తెరచిచూడు బాల్య పుటలలో నేనుంటాను...
కలసిరాని కాలాన్ని తరచి చూడు మరువకూడని స్థానం లో కనిపిస్తాను....
కరుణించిన కలిమి నిన్ను కనకపు సిం హాసనమెక్కించింది...
కలుషిత నాగరికత మిన్ను కెగసి గడచిన నీ గతాన్ని మరిపించింది..
ఆర్థిక అంతరము చిన్ననాటి చెలిమిని నిర్దయగా నలిపేసింది... 
అభివృద్ది అహ్లాదమేగాని  నిరాదరణ నిందనీయం...
కలిమి చంచల గమని... చెలిమి తరగని గని...
నేడన్నది నీదైనట్లే... రేపన్నది నాదేమో...
ఏ నాడు ఎవరిదైనా మనదేనని భావించనపుడు... మన జీవితాలు వృధానేమొ...  
ఆత్మీయత అనే పదానికి  అర్థం నీ నిఘంటువులొ తప్పుగావుంది నేస్తం...
అనుబంధాలు సరిచూసుకో... అర్థ భరిత గణితాలు సరిచేసుకో...
ఘటనుంటె  మళ్ళీ కలుస్తాను... గడువైతె వెళ్ళిపోతాను... పుటలలో మిగిలిపోతాను...

Wednesday, 12 August 2015

క్రీ(నీ)డలు


కాసులు కురిపించే క్రీడలకే గాని...
కనక పతక మాలతో భరతమాత మెడను మెరిపించే ఆటలకు ఆదరణ ఏది...
దేశ ప్రతిష్ఠ కోసం కష్ట పడితే అవసానదశ లో అనుభవించేది నికృష్ఠ జీవితమేనా...
నురుగులు కక్కేలా పరుగులు తీసిన కాళ్ళు  నడవలేకుంటె...
అంతుచిక్కని వ్యాధి వ్యధలు పెడుతూంటె...
ఆదుకొమ్మని ఆర్తనాదాలు పెడుతున్నాయి అలనాటి ఆటగాళ్ళ రిక్త హస్తాలు...
తుప్పు పట్టిన అధికారుల వీనులకు వినిపించడం లేదు...
కైపెక్కిన నేతల కళ్ళకు కనిపించడం లేదు...
లక్షల  గొంతుకల  కేరింతల నడుమ లక్ష్యాన్ని చేధించి...
మువ్వన్నెల పతాకాన్ని రెపరెప లాడించిన  రణధీరులు... 
రెక్కాడని రోజుల్లో బిక్షగాళ్ళవుతున్నారు...
పతకాలు తేలేరని పళ్ళికిలెస్తే సరికాదు...
కంటి తుడుపు నిధులతో కరములు దులుపుకుంటె సరిపోదు...
పక్షపాతం  పక్కన పెట్టి... ప్రతిభకే పట్టం కడితే...
సొంతలాభం కొంతైనా వెనక్కు నెట్టి... విస్వస్థాయి వనరులు సమకూర్చుకుంటె...
పసిడి పతకాలు వరదలై పారవా...
భరతయువత ప్రతిభ భూమండలమంతా పరిమళించదా...
కొటికొక్కటొచ్చినా  శతాధిక స్వర్ణాలు మనవి కావా...
గతవైభవ వీరులను ఆదుకోవాలి... భావితరాల యువశక్తికి స్పూర్తినివ్వాలి...

***************************

కొన్ని చేదు నిజాలు...

మొహమ్మద్ యూసుఫ్:
ఫుట్బాల్ ప్లేర్.
ఒకసారి అతని ఇంటి మీదుగా  వెళుతున్న  స్కూల్ పిల్లవాడు, పేదరికం కొట్టొచినట్టు కనిపిస్తూ... పార్కిన్సన్స్ వ్యాధి కారణంగా వణుకుతున్న అతని చేతిని చూసి...
"తాతా నీవు చిన్నప్పుడు వ్యాయామం చేయలేదా...?"
"చేశాను... ఫుట్బాల్ ప్లేర్ని..."
"పొరపాటుచేశావు... క్రికెట్ ఆడిండాల్సింది..."
బాధ పడుతూ వెళ్ళిపోయాడు... 
ఆ పిల్లవాడికి తెలియదు... యూసుఫ్  అర్జున్ అవార్డు గ్రహీత అని...  1962 ఏసియన్  గేంస్ ఫైనల్ లో దక్షిణ కొరియాను ఓడించి,  మొదటి సారిగా దేశానికి బంగారు పతకం తెచ్చిన ఫుట్బాల్ టీం మెంబరని...  ఏసియన్  ఆల్ స్టార్స్ టీం కు ఎన్నికయిన ఇద్దరు భారతీయులలొ ఒకడని...

తెగిన చెప్పును కుట్టించుకునే స్థోమత లేక  పిన్ను తగిలినిచుకుని, చేతులు వణుకుతూ...  బక్షాగాడి లా కనిపిస్తున్న  యూసుఫ్  ను చూసి ఎవరు మాత్రం వూహించగలరు...

మాఖన్  సింగ్ :
రన్నర్, 1962 ఏసియన్ గేంస్ లో ఒక స్వర్ణం, ఒక రజిత పతక విజేత... 1964 లొ కలకత్తా లొ మిల్కా సింగ్ ను 400 మీ.  పందెంలో రెండడుగుల దూరంతో ఓడించిన ప్రతిభాశాలి... అర్జ్జున్ అవార్డు గ్రహీత... మధుమేహం(డయబిటీస్) కారణంగా కాలును కోల్పోయి...  ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే ఆర్థిక స్తోమత లేక... బ్రతుకు బండిని లాగించడనికి ఓ చిన్న స్టేషనరి  కొట్టు నడుపుకుంటూ జీవితాన్ని కొనసాగించాడు... 

ఒకసారి... అర్జున్ అవార్డు గ్రహీతలకు  రైల్వె కాంప్లిమెంటరి పాస్ ఇస్తున్నారని తెలిసి డిల్లీ లోని రైల్వె భవనుకు వెళితే    అతన్ని బిక్షగాడిగా భావించి , లోపలికి అనుమతినివ్వలేదు... సుమారు రెండు గంటల కాలం వివరించి ౠజువు చేసుకున్న తరువాత అనుమతిచ్చారు... 

గోపాల్ బెంగ్రా:
1978, అర్జేటీనా లో జరిగిన హాకీ వర్ల్డ్ కప్ టీం మెంబర్ ... ఎన్నో విజయలు సాధించి పెట్టిన ఆటగాడు... బ్రతుకు తెరువు కోసం మురికి కాలువల్లొ చేపలు పట్టుకుంటూ..., రాళ్ళు కోట్టె కూలీగా   జీవితం గడిపాడు... ఈ బిహారి వీరుడు...

సర్వాన్ సింగ్:
"నీవు గెలిస్తే అది దేశం గెలుపవుతుంది..." ఇవి అతని గురించి జవహర్ లాల్ నెహ్రూ గారు అన్న మాటలు...
1954 ఏసియన్ గేంస్ 110 మీ... హర్దిల్స్ లో స్వర్ణ పతక విజేత... తరువాత అతన్ని పలకరించిన దిక్కులేదు...
పొట్టకూటి కోసం టాక్సి  డ్రైవరు అవతారమెత్తాల్సి వచ్చింది...  

ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద పుస్తకమే అవుతుంది.... మంచి రోజులు రావాలని... ఒలింపిక్స్ లో మన దేశం పేరు మొదటి స్థానంలొ చూడాలని ఆశిద్దాం...   

Friday, 7 August 2015

ఓ కధ విందామా...!

"బస్టాండ్ లో ఉండడం ఇబ్బందిగా వుందండి..... ఒకటే గొడవ..... ఏదైనా గుడి చూసుకోవడం మంచిది...."
"రాత్రిళ్ళు మూసేయరూ...?"
"నిజమే"
వృద్ద దంపతుల సంభాషణ... రమణారావు...సుమారు డెబ్బై ఏళ్ళు.. రాజ్యలక్ష్మి... ఓ ఐదేళ్ళు చిన్నది, వీరికి ముగ్గురు   కొడుకులు. పెద్దవాడేమొ అమెరికాలొ సెటిలయిపోయాడు. పలకరింపులు ప్రత్యుత్తరాలు ఏమివుండవు.. రెండవవాడు బిజినెస్. వాడికి జీవితాలన్నా వ్యాపారమే.. మూడవవాడు ప్రభుత్వ వుద్యోగి. ప్రభుత్వమే వాడిదన్న  ఫీలింగ్ ఎక్కువ. వున్న కొద్దిపాటి ఆస్తులు పంచుకున్నారు గాని భాద్యతలు పంచుకోవాలంటె ఇష్టం లేదు.. గొడవలు... హద్దు దాటిన ప్రవర్తనలు బాధ పెట్టేసరికి, భరించలేక ఇద్దరూ తమవాళ్ళకే కాకుండా సొంతవూరికి కూడా చాలా దూరంగా, ఎవరూ తమని గుర్తుపట్టలేని ప్రాంతానికి వచ్చేశారు...  ముసలి కడుపులు నింపుకోవడాని ఏదో ఒక పని దొరక్కపోదా అనుకున్నారు .. రెండు నెలలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.. వానాకాలం చదువులు, పైబడిన వయస్సు.. సరైన చికిత్స కరువై మందగించిన కంటిచూపు. అది అర్థం చేసుకోవడానికి ఇంతసమయం పట్టింది.. మొదటి రెండురోజులు లాడ్జిలో గడిపారు. ఆర్థిక పరిస్తితులు అంచానా వేసి, మకాం ను బస్టాండుకు మార్చారు...  ఆధారమేదైనా దొరికితే గుడిసె లాంటిది ఏర్పాటు చేసుకోవచ్చులే అనుకున్నారు...

"పొరపాటు చేశామంటావా...?"
"ఏమొ"
"అది కాదే.... వాడు నాపై చేఎత్తాడు.. చూశావుగా...."
మౌనం...
"అభిమానం  అణుచుకోలేక పోయాను... రాజ్యం... నువ్వక్కడనే వుండాల్సింది.. నువ్వు చాకిరీకి పనికొస్తావు... నేనె, వారికెందుకు వుపయోగపడను... "
మౌన రోధనె సమాధానమయింది..  
రాజ్యలక్ష్మి ఆలోచనలు రాబోయె కష్టాల చుట్టూనే వున్నాయి.. తెచ్చిన డబ్బు పూర్తిగా అయిపోవచ్చింది.. వాళ్ళను బిక్షగాళ్ళుగా భావించి  ఒకరిద్దరు రాజ్యలక్ష్మి చేతిలో చిల్లర వేశారు... రమణారావుకు విషయం తెలిస్తే తట్టుకోలేడని తెలుసు.. ఆ పరిస్థిలో అమెకది తప్పుగా అనిపించలేదు.. రమణారావు కంటపడకుండా కొద్దిరోజులు ఆ పని చేయక తప్పదు... తను కడుపు కాల్చుకోగలదు కాని భర్త ఆకలి బాధ పెడుతుంది... ఎలా... ముందు బస్టాండునుండి బయటపడాలి... కలత నిద్రలోకెళ్ళి పోయింది..

మరుసటి రోజు, దగ్గరలోనే వున్న ఒక పాడుబడిన మంటపానికి మకాం మార్పించింది రాజ్యలక్ష్మి.. ఓ ఇంట్లొ పనికుదిరిందని అబద్దం చెప్పి బిక్షాటన మొదలెట్టింది... మొహమాటం తో ప్రాణం పోయినంత బాధగా అనిపించినా,  ఏదైనా పని దొరికేవరకు తప్పదని   సరిపెట్టుకుంటోంది.. ఒక్కతే అయితే ఈపాటికి ఆత్మహత్యకు   పాల్పడేదేనేమొ..

కొద్దిరోజులు గడిచాక రాజ్యలక్ష్మికి ఒక ఇంట్లొ పాచి పని దొరికింది... అడ్వాన్సు కూడా ఇచ్చారు..  వాళ్ళుంటున్న మంటపానికి దగ్గరలోనె ఇల్లు.. ఆమె ఆనందానికి ఆవధులు లేవు... భర్తకిష్టమైన ఆహారం కొనుక్కొని మంటపంవైపు పరుగులుతీసింది...భర్తకు వడ్డించింది... కబుర్లు చెప్పింది... కాళ్ళుపట్టింది... నిద్రపుచ్చింది...

ఉదయం ఎవరో తట్టిలేపుతున్నారు... రమణయ్య వులిక్కిపడి లేచాడు... ముగ్గురు పోలీసులు మరో ఇద్దరు.. రమణయ్యకు విషయం అర్థంకాలేదు... బహుశా ఈ మండపం లో కాపురం చేస్తునందుకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారేమొ అనుకున్నాడు....

"మాకు తెలియదండి... ఇప్పుడే ఖాళీ చేసెస్తాం సార్..."
"అది సరే, రాజ్యలక్ష్మి మీ భార్యెనా...?"
"అవునండి... ఏం చేసింది...?"
"అదేం లేదు... మీ ఆవిడ వీళ్ళింట్లొ పనికి కుదిరింది... వీళ్ళిచ్చిన ఇన్ ఫర్మేషన్  ఆధారంగా మి దగ్గరికి వచ్చాము... రాత్రి ఆ కనిపించే రోడ్డు దాటుతుండగా ఆవిణ్ణి ఓ లారి గుద్దేసింది... మీరోసారి మాతో రండి..."  

రమణయ్యకేమి అర్థం కావడం లేదు... ఓ రకమైన భయం మొదలైంది...చుట్టూ వెతుకుతున్నాడు....

"సార్ పొరపాటు పడ్డట్టున్నారు, రాత్రి ఆమె నాతొనే వుంది...."

జీపులో హాస్పిటల్ తీసుకెళ్ళారు...  అది రాజ్యలక్ష్మే... రమణయ్యకు నోట మాట రావడం లేదు...  ఏడుపుకూడా రావడం లేదు...

"చనిపోయిందయ్య.... మీ వాళ్ళెవరైనా వున్నారా.....?"

లేరన్నట్టు తల వూపాడు.... వేడి నిట్టూర్పులు...  జాలి పలుకుల గుసగుసలు... రమణయ్యకు స్పర్షకూడా తెలియని  పరిస్థితి...రాజ్యలక్ష్మిని అలా చూళ్ళేక పోతున్నాడు....తెలియకుండానే అడుగులు బయటికి తీసుకెళ్తున్నాయి...లీలగా ఇన్స్పెక్టర్ గొంతు వినిపిస్తోంది... "శవాన్ని పోస్ట్ మార్టం తరువాత మునిసిపాల్టి వాళ్ళకు అప్పగించేయండి... ఆ..  అలాగె    ఆ  పెద్దాయన్ను ఏదైన అనాధ శరణాలయం లో చేర్పించండి......" 

ఎటు వెళ్తున్నాడొ తెలియడం లేదు... రాత్రి భార్య చెప్పిన మాటలు... చూపించిన ప్రేమ... కళ్ళముందు కనిపిస్తోంది... రాత్రి తనదగ్గరకు వచ్చిందెవరు....? కాళ్ళుపట్టిందెవరు....? వణుకుతున్న కాళ్ళు రోడ్డెక్కాయి... 

బిజ్జీ గా వున్న రొడ్డు శబ్దాలేవి వినిపించడం లేదు... అందులో విపరీతంగా అరుస్తోన్న బస్సు హార్న్ కూడా వుంది...

అంతె... బస్సు రమణయ్యను గుద్దడము... రమణయ్య ఆకాశంలోకెగరడము చిటికెలో జరిగిపోయాయి... రాజ్యలక్ష్మిని అందుకొనేంత ఎత్త్తుకు ఎగిరాడేమో.... నేల చేరేప్పటికి ప్రాణం... లేదు...

మండేసుర్యుడికి కూడా చూట్టానికి  మనసొప్పకేమో, మబ్బు చాటుకు వెళ్ళి పోయాడు... ఆకాశం రోదిస్తున్నాట్టు   చినుకులు మొదలయ్యాయి... దిక్కు లేని వారికి ఏకైక దిక్కు ప్రకృతి మాతే కదా.... 

మనకు రోజూ కనిపంచే బిక్షగాళ్ళలో రమణయ్యలెంతమందో... రాజ్యలక్ష్మిలెంతమందో... ఒక్కసారి ఆలొచించండి.. కసురుకోకండి..

Wednesday, 5 August 2015

KANUMARUGAINA KALAAM

vignAnula vithathi naDuma virAT svarUpam ......virinchikE vismayam kaliginchE vyakthithvam ....
kalaluganaDam nErpina karmayOgi keerti bhAvi tharAlaku tharagani spUrti....
manasulu gelichina machalEni  punnami candamAma... 
sudheerga jeevana yAnam  lO sva sukhamerugani sahanaSheeli.. dharaNi garvinchadagina dheeshAli..
kona oopiri varaku jana sEva lOne gaDipina niranthara sainikuDu...
nisvArtha ShrAmikuDu... nirupamAna saitikuDu...
divijErina diggajAniki  neerAjanamu...
maraginchE manasthApam lO marO mahAtmuni mahAprasthAnam..
kanumarugai pOyina  kalAm  chirunavvuku aShrunayanAlatO  Akhari salAm...

Tuesday, 28 July 2015

కనుమరుగైన కలాం....

విజ్ఞానుల వితతి నడుమ విరాఠ్ స్వరూపం ......విరించికే విస్మయం కలిగించే వ్యక్తిత్వం ....
కలలుగనడం నేర్పిన కర్మయోగి కీర్తి భావి తరాలకు తరగని స్పూర్తి....
మనసులు గెలిచిన మచ్చలేని  పున్నమి చందమామ... 
సుధీర్గ జీవన యానం  లో స్వ సుఖమెరుగని సహనశిలి.. ధరణి గర్వించదగిన ధీశాలి..
కొన ఊపిరి వరకు జన సేవ లోనె గడిపిన నిరంతర సైనికుడు...
నిస్వార్థ శ్రామికుడు... నిరుపమాన సైతికుడు...
మరగించే మనస్తాపం...  మరో మహాత్ముని మహాప్రస్థానం.. దివిజేరిన దిగ్గజానికి  నీరాజనం...  
కనుమరుగై పోయిన  కలాం  చిరునవ్వుకు అశ్రునయనాలతో  ఆఖరి సలాం...

Wednesday, 15 July 2015

NESTHAMAA...

puDami chErina pradhama kshaNamE palakarincina pillagAlitO modalaindi modaTi snEham...
buDi buDi naDakala baDi prAyamlO kalmashamerugani  kamanIya snEham...
vaDi vaDi parugula vayasoccinA vanne taggani neyyamu ... vAvi varasala vAtsalyamu...
cilipi cEShTala cammadanamu... jilibili tagavula tiyyadanamu...
sAhasAlaku venukADani sahavAsagALLatO gaDipina allari tiruguLLa rAtriLLu....
vinOdAla anchulu tAkina sandaLLu.. haddumIrinappaTi amma nAnnala akshintalu... gurtunnAyA nEstham...
vidhi  bAdhitulamai visiri vEyabaDDAmE gAni..eda gondi lO anurati alAgE vundi..
madhura smRutulalO tEliyaDutUnEvundi... vunTundi... maru kalayika kOsam eduruchUsthUnE vunTundi...  

నేస్తమా ....


పుడమి చేరిన ప్రధమ క్షణమే పలకరించిన పిల్లగాలితో మొదలైంది మొదటి స్నేహం...
బుడి బుడి నడకల బడి ప్రాయంలో కల్మషమెరుగని  కమనీయ స్నేహం...
వడి వడి పరుగుల వయసొచ్చినా వన్నె తగ్గని నెయ్యము ... వావి వరసల వాత్సల్యము...
చిలిపి చేష్టల చమ్మదనము... జిలిబిలి తగవుల తియ్యదనము...
సాహసాలకు వెనుకాడని సహవాసగాళ్ళతో గడిపిన అల్లరి తిరుగుళ్ళ రాత్రిళ్ళు....
వినోదాల అంచులు తాకిన సందళ్ళు.. హద్దుమీరినప్పటి అమ్మ నాన్నల అక్షింతలు... గుర్తున్నాయా నేస్తం...
విధి  బాధితులమై విసిరి వేయబడ్డామే గాని..ఎద గొంది లో అనురతి అలాగే వుంది..
మధుర స్మౄతులలో తేలియడుతూనేవుంది... వుంటుంది... మరు కలయిక కోసం ఎదురుచూస్తూనే వుంటుంది... 

Thursday, 25 June 2015

MIND GAME


allari manasu aagaDaalu varNinchanalavikaavu….
oka  kshaNam alala anchulapainaa… marukshaNam ambudhi agaadham lOnaa…
vegam deeni guNam.. chanchalyam deeni lOpam…
kaalaparimithulu lEvu… aaspada avadhulu lEvu…
gagana veedhullO grahaanthara prayaaNamainaa…
gathapu porala nunDi  bhavishyath oohala samyaanamainaa .. reppapaaTu chaalu…
bhaasha mounamE ainaa bhavaalaku puTtinillu….
aavEshodhrekaalaku ekkupeTTina villu…
virigina manasu vipareetha pariNaamala gani…
manchi vaipu veLithe marapuraani vijayam neede….
marOvaipu veLithe madhukalashamlO samaadhe….
antaraathmanu andalamekkisthe jagamantha aanandamayam…
manasuku pattam kaDithe manugaDa shoonyam….

KADALIRAA......

prathi kathalo kanneeru...prajwarilley aashayaalu .....
jwalinche gundellO maruguthunna raktham egisi egisi paduthunte ...,
maarpuvai kadaliraaa...maalinyanni phekilincharaa...
nippu kanikavai kaadura ... niTtalaakshudivai kadaliraa...
garaLaanni mingi amrutaanni varshincharaa...
aavesham aayudamai aadi shakthila maarara ...

vyakthivi kaadu vyavasthavi.... vidhinedirinchagala onTari sainyaanivi....
ee kshaname naayakudai mundhaduge veyaraa.......
ninnu koolchedevaDuraa aakasham neevaithe ....!
ninnu yedirinchedevaDura suryuDive neevaithe .....!
aashayam oka parvathamai... prathi aDugu vuppenai ... 

nee dhyeyam neraverchaga   ee kshaname kadaliraaaa...... 
khrodhinchina kaDali laa kadaliraaaa... venuthiragani vuppenalaa kadaliraaa....

Wednesday, 24 June 2015

AAYUDHAM...

paruguleDuthOndi chooDu kaanaraani kaalachakram ...
manasu viriche kalatalenduku, maraliraadu taralipOyina kshaNam.....
antuchikkani agaadhamEledu anveshinche aajaanamunDaali.....  
pratyekata leni praanE ledu... gurtinche guNamunDaali...
edirinche  vaaranTe  vidhikaina gowravamE...
niduramatthu veeDakunTe nee neeDakaina chulakana bhaavamE...
vishaadamerugani  eDadunDadu..
kotta chigurunu chooDani komma vunDadu...
cheekaTenta prayatninchinaa aapalEdu prabhaatakiraNaanni... 
chEva galiginavaaDi chevi daaTina bhaaNam chEdinchagaladu lakshyaanni...
aluperugani prayatnamE alanaaTi veerula vijaya rahasyam... 
alasatva aavaahanamE apajayaaniki aarambham... 
aatmasthairyaani kannaa merugaina aayudham lEdu... 
nairaashyamunu  minchina  shatruvu  lEDu...  
ninnu nuvvu gurtinchani naaDu niTalaakshuDu kooDaa ninnu kaayalEDu....

NIRBHAYA.......


chattalu aapalevu nishachaarula nikrushta cheshtalu....
chowkabaaru chaduvulu choopalevu samskaarapu baatalu....
antharjaalamandinche(internet) ananta gnaana sampadhanu vadilesi
ashleela bharitamaina pakshima samskruti vaipu parugulu teesi
ade aadhunikamanukune adhamasthaayiki  digajaarindi  agnaana samaajam...
vaavi varusalu levu... vayasu vichakshNalu kaanaraavu...
pagati pooTainaa padathiki praaNa sankaTame...maana sangharshaNamE...
udyOgam  chEse vuvidaku dina dina gamDamE...
vittha samoopaarjanE  gaani  chittha shuddi nErpani vidyalenduku...
manOvikaasam lEni manugadenduku..
maanavatvam nashinchina manishi janmenduku..
padathini pudami tallitO pOlchina puNyabhoomi manadi...
inthini  ilavElupugaa kolichina nEla manadi...
naayakula anDatho nagara vihaaram chEstunnaayi nararoopa mrugaaalu...
naanaatiki  perigipOthunnaayi naligipOyina vanitala kaLEbaraalu...  

Tuesday, 23 June 2015

మన సొంతం...

గల గల పారే గంగమ్మ గాంభీర్యం మనదే..పసిడి పంటల గోదారి పరవళ్లు మనవే..
మురళీ రవళిలో మైమరచిన యమునాతీరం మనదే....
కీర్తికి కొలమానమైన మంచుకొండ మనదే... వివిధ సంస్కృతుల  వైవిద్యం మనదే...
నాగరికతకు ఆద్యమైన వేదభూమి మనదే...
శిలను సైతం చేరదీసి శిరసు వంచే సౌశీల్యం మనదే...
మనిషినే కాదు  మానును కూడా ఆదరించి పూజించె ఔదార్యం మనది...
తెల్లవారి గుండె జల్లుమనిపించిన అల్లూరి విల్లు మనదే...
గుండుకు గుండెనొడ్డిన ఆంధ్రకేసరి ధీరత్వము మనదే...
సినారె కలం మనదే... ఘంటషాల గళం మనదే....
శ్రీనాథుని సీసము మనదే... శ్రీశ్రీ  శ్రీమకుటము  మనదే...
నరేంద్రుడు నేతాజి.. భగత్సింగ్ బాపూజి.. రత్నాలకు జన్మనిచ్చిన రత్నగర్భ మనది...
పొగడరా నీతల్లి భూమి భారతిని...   నిలుపరా నీజాతి నిండు గౌరవము....

Monday, 22 June 2015

నిర్భయ...

చట్టాలు ఆపలేవు నిశాచరుల నికృష్ట చేష్టలు....
చౌకబారు చదువులు చూపలేవు సంస్కారపు బాటలు....
అంతర్జాలమందించే అనంత జ్ఞాన సంపదను వదిలేసి
అశ్లీల భరితమైన పక్చిమ సంస్కృతి వైపు పరుగులు తీసి
అదే ఆధునికమనుకునే అధమస్థాయికి  దిగజారింది అజ్ఞాన సమాజం...
వావి వరుసలు లేవు... వయసు విచక్షణలు కానరావు...
పగటి పూటైనా పడతికి ప్రాణ సంకటమే...మాన సంఘర్షణమే...
ఉద్యోగం  చేసె ఉవిద కు దిన దిన గండమే...
విత్త సమూపార్జనే గాని చిత్త శుద్ది నేర్పని విద్యలెందుకు...  మనోవికాసం లేని మనుగడెందుకు..
మానవత్వం నషించిన మనిషి జన్మెందుకు..
పడతిని పుడమి తల్లితో పోల్చిన పుణ్యభూమి మనది...
ఇంతిని ఇలవేలుపుగా కొలిచిన నేల మనది...
నాయకుల అండతో నగర విహారం చేస్తున్నాయి నరరూప మృగాలు...
నానాటికి  పెరిగిపోతున్నాయి నలిగిపోయిన వనితల కళేబరాలు...

Sunday, 21 June 2015

ఆయుధం


పరుగులెడుతోంది చూడు కానరాని కాలచక్రం ...
మనసు విరిచే కలతలెందుకు, మరలిరాదు తరలిపోయిన క్షణం.....
అంతుచిక్కని అగాధమేలేదు అన్వేషించే ఆజానముండాలి....
ప్రత్యేకత లేని ప్రాణే లేదు... గుర్తించే గుణముండాలి...
ఎదిరించే  వారంటె విధికైన గౌరవమే...
నిదురమత్తు వీడకుంటె నీ నీడకైన చులకన భావమే...
విషాదమెరుగని  ఎడదుండదు..
కొత్త చిగురును చూడని కొమ్మ వుండదు...
చీకటెంత ప్రయత్నించినా ఆపలేదు ప్రభాతకిరణాన్ని...
చేవ గలిగినవాడి చెవి దాటిన బాణం చేదించగలదు లక్ష్యాన్ని...
అలుపెరుగని ప్రయత్నమే అలనాటి వీరుల విజయ రహస్యం...
అలసత్వ ఆవాహనమే అపజయానికి ఆరంభం...
ఆత్మస్థైర్యాని కన్నా మెరుగైన  ఆయుధం లెదు... నైరాశ్యమును  మించిన  శతృవు  లేడు... 
నిన్ను నువ్వు గుర్తించని నాడు నిఠలాక్షుడు కూడా నిన్ను కాయలేడు....

Wednesday, 17 June 2015

అందాల బృందావనం...

వెల వెల బోతున్న పుడమి తల్లిని పలుకరించింది తొలకరి చినుకు.....
గల గల పాటల సెలఏటి కులుకు... మిల మిల మెరిసే అలల తళుకు....
పరవషించిన కోయిల పలుకు.....
నల నల్లని మబ్బుల ఒడి నుండి వడి వడి గా జారుతున్న జడివాన అలజడి...
మెల మెల్లగా వీస్తూ మనసును చల్లగా తాకుతున్న పిల్లగాలి సవ్వడి...
తెమ్మెర తరంగాల్లో తుశారాన్నై  ... వికసించిన విరి తావినై .... చిదాత్ముని చిద్విలాసంలో కలిసిపోనా...
మిన్ను మేనిపై మెరుపునై... మేఘమాల మందహాస మిసిమినై.... అవని అమ్మ ఒడిలో నిదురపోనా... 
మాటలకందని మథురానుభూతి.... దేవులపల్లి ఆనంద గీతి...
మథురానురాగాల మాతృమూర్తి...  మైమరపించె ప్రకృతి....
ఆస్వాదించె మనసుకు జగమంతా అందమైన బృందావనమే... ప్రతిక్షణము ఆనందమయమే...

Saturday, 30 May 2015

దినకర తాపము


పరాకాష్ట చేరిన భానుని ప్రతాపం....
మండే ప్రచండ జ్వాలల నడుమ ప్రాణి కోటి విలాపం....
కొంతమందికే చలిమర గదుల విలాసం..... విహారాల వైభోగం.....
వయసు మళ్ళిన విగత కూలీల శవాలు
మగత కమ్మిన మన నాయకుల స్వార్థానికి సాక్ష్యాలు......
కాలుశ్య మంటల్లో వుడికి పోతున్న పుడమి గ్రీశ్మ తాపానికి విలవిలలాడిపోతోంది....
చిరిగిపోయిన ఓజోను తెర వెర్రి విజ్ఞానాన్ని వెక్కిరిస్తోంది...
అతినీలలోహిత కిరణాలు అమాయక జీవుల అసువులు హరిస్తున్నాయి...
అడుగున దాచుకున్న నీళ్లన్ని ఆవిరైపోతున్నయి..
ప్రసన్న వదన మన ప్రకృతి మాత మన వికృత  చేష్టల వలన రక్కసి గా మారుతోంది....
మనం మారకుంటె మన రాబోయె తరం రక్కసి పాలె... అంగారకుని లాగ అవని కూడా ఆరని జ్వాలే...
చలువ చందనాల చంద్రలోకంలో కలువ పందిరికింద కునుకు తీద్దామా...
కడలి  అడుగున జేరి అరుణ కిరణ జ్వాలను ఆడ్డుకుందామా.... 

Friday, 22 May 2015

మైండ్ గేం

అల్లరి మనసు ఆగడాలు వర్ణించనలవిగావు....
ఒక క్షణం అలల అంచులపైన.... మరుక్షణం అంబుధి అగాధం లోన....
వేగం దీని గుణం... చాంచల్యం దీని లోపం....
కాల పరిమితులు  లేవు... ఆస్పద అవధులు లేవు....
గగన వీధుల్లో గ్రహాంతర ప్రయాణమైనా...
గతపు పొరల నుండి  భవిష్యత్ వూహల సంయానమైనా... రెప్పపాటు చాలు ....
భాష మౌనమే ఐనా భావాలకు పుట్టినిల్లు...
ఆవేశోద్రేకాలకు ఎక్కుపెట్టిన విల్లు...
విరిగిన మనసు విపరీత పరిణామాల గని...
మంచివైపు వెళితే మరపురాని విజయం నీదె...
మరోవైపు వెళితే మధుకలశంలో సమాధె...
అంతరాత్మను అందల మెక్కిస్తె... జగమంతా ఆనందమయం...
మనసుకు పట్టం కడితె... మనుగడ శూన్యం...

Monday, 11 May 2015

దేవుని చిరునామ...

ఆదినుండి అనంతవిశ్వంలొ అన్వేషణ జరుగుతూనే వుంది..
లెక్కించనలవికాని పాలపుంతలనడుమ పుడమి వైశాల్యమెంత....?
మూడింతల నీటి మధ్యన మట్టి నేల పరిమాణమెంత......?
అతిధిగా అవని చేరిన నీ ఆకారమెంత.....? అవగాహనెంత....?
వసుంధర వయసుముందు నీ ఆధునిక విజ్ఙాన ప్రాయమెంత...? పరుధులెంత....?
అప్పుడే పుట్టిన పురిటి శిశువు విరించిని చూసి వెక్కిరించినట్టున్నాయి విజ్ఙానపు వీచిపలుకులు...
నా వునికిని ప్రశ్నించే ముందు నీ అర్హతను తెలుసుకోవెందుకు.....?
దినకరుని లేత కిరణాలను రెప్పపాటు కాలం వీక్షించలేని నీ తోలు చక్షువులు
కోటిరెట్ల తీక్షణ కాంతి పుంజాన్ని భరించగలవా ...? నన్నుచూడగలవా ...?
నిశ్కల్మష  హృదయం... నా నివాసం ...అకుంఠిత విశ్వాసం దారి చూపె దీపం...
అలుపెరుగని ప్రయత్నం నా దరి చేర్చె నావ ...జ్ఞానికి జగమంతా నా రూపమె..
పసి పాపల పసిడి నవ్వుల్లో ... పూచె పువ్వుల్లో .. మూగజీవుల ఆకలి చూపుల్లో ...
సాధుజనుల సాంగత్యంలో ... సెలయేటి గలగలల్లో... అలల నురుగుల్లో... మలయ మారుతంలో... మమతానుబంధాల్లో..బాదితుల ఆర్ద్రంలో...
అమ్మ ప్రేమలో...  అన్నింటిలోను నేనె...నేను కానిది యేది లేదు...
నిర్వికారం... నిరంజనం...నీ నిర్మల హృదయంమె నా చిరునామ...

Friday, 8 May 2015

ఓ మనిషి తిరిగిచూడు ....

ఆమ్మ చాటు ప్రాయంలొ అంతరాలు ... అంతరంగాలు తెలిసేవి కాదు....
అడిగినవన్ని ఇఛ్ఛేది   ... అడగకుండానె ఆకలి తీర్ఛేది...
చిన్ని క్రిష్నున్ని చేసేది... అందాల రాముడినని పొగిడేది.... చెంగుచాటుచక్రవర్తిని అనిపించేది
" 'అమ్మకు చెబుతా " అన్న ఆయుధంతో అతిరధులనైన ఓడించేవాడిని....  
నా మొదటి అడుగు గుర్తులేదుగాని అమ్మ తుదిశ్వాస బాగా గుర్తు... 
ఆక్షర్యం  .. ఆక్షణంలో కాలం ఆగిపోలేదు... ఎవరి దినచర్యల్లోను మార్పులేదు.. 
అమ్మ పలుకు ఆగిపోఇంది... ప్రకృతి  స్టంభించలేదెందుకు ... ఆబాధను వర్ణించడానికి దేవుడు పదాలనివ్వలేదెమిటి....
చిన్న బాధకే ప్రతిస్పందించే అమ్మ నా ఆవేదనాశ్రువులను  పట్టించుకోదేమిటి ...
జాలిగా చూసిన చూపులు... ఇప్పుడు దొరికావంటూ విధి వెక్కిరింపూ అన్నీ గుర్తున్నాయి..
ఎంతగా ఏడ్చినా వీడని అమ్మ మౌనం గుర్తుంది..
కష్టాలను మింగింది.. సుఖాలను పంచింది...  సుఖపడే సమయానికి కనిపించని దూరాలకు వెళ్లిపొయింది  ...
దారిలొచేయిచాచె అమ్మల కళ్ళల్లొ పలకరింపుగ కనిపిస్తుంది... కంటతడిపెట్టిస్తుంది..
ఎంతమందినో కన్నకడుపులు ఆకలికి తట్టుకోలెక రోడ్డ్లెక్కుతున్నాయి ... ప్రత్యక్షదైవాలు దిక్కులేని అనాథలుగ వీధుల్లొ తనువులు  చాలిస్తున్నాయి
జాలిలేని కొడుకుల వునికికి సాక్ష్యంగా... అలుముకుంటున్న రాక్షస  సంస్కృతికి బలిపశువుగా.. .
మాటలు రాని మృగాలు సైతం కారుణ్యం  ప్రదర్షించిన సంధర్భాలెన్నో  .....
మానవత్వన్ని కాలరాస్తు  క్షణిక సుఖాల మత్తులో  మనిషి పయనం ఎటువైపో .....
తిరిగి చూసుకునేప్పటికి.... మిగిలేది శూన్యమె... 

Saturday, 2 May 2015

గతం

నీ ప్రతి కదలిక  నేనె... ప్రణాళికలు..ప్రమాణాలు..పదవిన్యాసల పరిణామాలు...ప్రతి పుటలొ కనిపించె ప్రామాణిక నిభంధనలు......

అలకలు...అలసటలు...అన్నీ నేనె...
ఆత్మీయుల మహాప్రస్థానంలొ పెల్లుబికిన మౌనవిలాప రుధిరాష్రు జలపాతాన్ని నేనె...

నవ్యానుబంధ క్షణాల ఆనంద భాష్పాన్ని కూడా  నేనె...

అలజడులు నేనె ... అమృత గడియలు నేనె...
నిర్ణయాల నిమిషంలొ హెచ్చరికను నేనె...

శూన్యం లోకి జారిఫొయె నీ ప్రతి నిమిషానికి సాక్ష్యాన్ని నేనె...

గమనించావా..!... అలనాటి రంగుల కలను నేను...
జ్ఞాపకాల అలను నేను  ... నీ భవిష్య నిర్మాణంలొ జ్ఞానజ్యొతిని నేను...

నీ గతాన్ని నేను... నీ గతాన్ని నేను.. 

Ghatham

nee prathi kadhalika neney... praNaalikalu..pramaaNaalu..padhavinyasala pariNaamaalu...prathi putalo kanipinche pramaanika nibhanDhanalu......

alakalu...alasatalu...anni neney...
Aathmeeyula maHaa prasthanamlo pellubikina mounavilaapa ruDhiraashru jalapathaanni neney...

navyanubanDhaKShaNaala Aanandha Bhashpaanni kudaa neney...

alajadulu neney ... amrutha gadiyalu neney...
nirNayaala nimishamlo hechcharikanu neney...
nimeeshamlo kalisipoye nee prathi nimishaaniki saakshyaanni neney...

gamaninchaavaa..!... alanaati kalanu nenu...
gnyaapakaala alanu menu ... nee Bhavishya nirmaaNamlo gnyaana jyothini nenu...

nee gathanni nenu... nee gathanni nenu..

Sunday, 12 April 2015

ఆరిన దీపం నీడన, చిరునవ్వు ఉరికంభం ఎక్కింది......
చీకటితో స్నేహం చేస్తూ....
ఆకలితో ఆటలాడుతూ....
చావు ,నిదురకు తేడా తెలియక.....
కన్నులు కనలేని కలలొ జీవిస్తున్నరు......
దాహం తీరని గొంతు, ఆవేదన పలుకలేక పొయింది.....
కంట నీరు సైతం కరువైంది.....
గగన తలపును తట్టె భవనం, దేహానికి నీడను ఇవ్వలేకపొతే.....,
ధనవంతుల చేతిలొ మెరిసే ధనం , ధాన్యం కూడా రాల్చలేకపొతే......
మానవత్వం మట్టి కలిసినట్టే....
ఇప్పటికైనా మేలుకుందాం...రేపటి దేశానికి చేయూతనిద్దాం........
రాజులెందరో ... రాణులెందరో ...
వీరులెందరో ., శూరులెందరో ..
సమర క్షేత్రమున తెల్ల నక్కల సింహ స్వప్నమై .,
భరత దేశ స్వేచ్ఛ కొరితే .,
వీది కుక్కల వెన్నుపొటుకు వీర మరనం పిలుపునిస్తే ..
విర్ర వీగిన అశుర సైన్యం నేల కూల్చగ ,
కదలి వచ్చెను శాంతి రూపం బాపు సైన్యం ..
హింస విడిచిన సత్య రూపం బాపు పోరటం ..
కలం పట్టి పథం పరిచిన నెహ్రు స్పూర్తితో ..
కలసి నడిచిన భరత దేశం రొమ్ము చూపి నిలిచింది ..
ఒనుకు పుట్టిన తెల్ల గుండెలు ,
సరి హద్దు దాటి పరుగు తీసింది ..
స్వతంత్ర దేశం ఉదయించింది....
త్రివర్న జెండ రెక్కలు విచ్చుకుని చిరు నవ్వు చిందించింది..
చీకటి వెలుగును తరిమింది..
కంటికి శూన్యం చూపింది....
న్యాయం నరకం చేరింది...
అన్యాయం పాలన పట్టింది...
ధర్మం అశృవు బాసింది...
అధర్మం గంగను బోసింది...
ఆకలి రాజ్యం ఏలింది....
యమ పాశం భువికి ఎగసింది....
ఆశ ఆవిరైపొయింది...
ఓర్పు నిట్టూర్పు విడిచింది...
ప్రాణం ఒక వాడిన పువ్వై రాలింది.....
మరో పుష్పం వికసించాలి ...
గాంధీ తానై ఎదగాలి .....
నాటి తంత్రం మరవాలి ,నేటి పిడికిలి కావాలి....
ధర్మం, న్యాయం చూపులొ నిలువగ స్వతంత్రం తిరిగి తేవాలి......
nakantu evaru leru neney oka
dhesham..
Nadhantu yedi ledu neney e
vishwam...
Moogadaina gundelo..
Aaviraina pranamtho..
Palukaleni prema dhachi..
Kanneetini chithiki cherchi..
Theerani dhahamlo dhehaanni
dhahisthu ..
Nadusthondi na manasu
shoonyamlo adugesthu...
Naakantu evaru leru neney oka
dhesham...
Nadhantu yedi ledu neney ee
vishwam
yeduvu gundelu pagilela , kantilo aakari neeti chukka neyla ralelaa.. Eduvu
thirigi le , kanneeti kadalilo tsunami la., ne ashruvu viluvanu chopinchu...
Ninu malli edipinchalante vadu laksha sarlu alochinchali..
You are the weapon, you are the power....
' ee viswam naaku sontham...' anna dhyryam kadharaa... "sneham"
Cheekatilo thodu niliche needey kadaraa "sneham"
Ye maargam dhorakani tharunam, aa dhevudi varamey "sneham"
Thaarala premaku chihnam , jaabili muddhey "sneham"
Prati gundeku swaramey "sneham"
Aa smaramuku bhaavam nestham...
Kantiki paapai , pedhavipai navvai santhosham kuripinchunu "sneham"
Aashaku aayuvu "sneham"
Niraashaku mruthyuvu "sneham"
Naa lokam..., naa nestham..., naa prema prapancham...
Dedicated to all my frnds
Ur vishnu
dhooram dhooram ante daggara avutharem...?
gundeku daggara chesthe dhooram avutharem...?
naakantu ika evaru ani nenu prashnisthe......
naakannaa neekevaaruuu.....? ani nanne prashnisthuu...
edpisthuuu oka nimisham...
navvisthuu maru nimisham...
maripisthuuu prathi nimisham naa thone vuntare......
osari ontarinaithe....!
osari lokam avutha......
osari navvula pantai...,
osari varadavutha.......
premisthuu vuntanu...
premai vuntanu....
mee voohallo prathi nimisham swaashisthoo vuntanu........
nadiche dhaarilo mullu vunna parledani munduku velthe voobilo kaalu jaaranu .... 
bhayatapadi mundhadugu vesthe thuphaanulo chikkukunnanu .... 
thala dhinchaka adugu vesthe vurumu baarina paddanu ... 
sommasilli nela raalithe tsunamilo kalasipoyanu...... 
gundelo bhaavamenthunna maataku pranam poyaleka pothunna .... 
gonthulo vedana enthunna pedavi dhaatinchalekunna.....
prathi kathalo kanneru...
prajwarilley aashayaalu .....
jwalinche gundello maruguthunna raktham egisi egisi paduthunte ...,
maarpuvai kadaliraaa....
nippu kanikai kaadura ... vushnudai kadaliraaaa............
aavesham aayudamai oka shakthila maarara ...
ee kshaname naayakudai mundhaduge veyaraa.......
ninnu kulchedevaaduraa aakasham neevaithe ....!
ninnu yedirinchedevvadura suryudive neevaithe .....!
aashayam oka parvathamai... parathi adugu vuppenai ... nee dhyeyam neraverchaga ee kshaname kadalaraaaa...... kadaliraaaa.......
" నిన్ను ప్రేమించే నా కళ్లలో...
  నిన్ను శ్వసించే నా ఊహల్లో...
      కదిలావే ఒక వరమై,
  నన్ను ఊరించే కలవరమై......."

" నీ అల్లరి - అందం , కోపం - అందం...,
  చిరునవ్వుల పలుకులు మకరందం .....
      రెప్పలు వాల్చక చూస్తున్నా...
      నా దాహం తీరదే కాస్తైనా ....
     ఏదో మాయలో పదుతున్నా...
     ఈ భావం పేరు ప్రేమేనా..............!"

ఊహల్లో నన్ను మురిపించే అందం నువ్వే..
నా గుండెలో కొలువుండే దేవత నువ్వే...

చిరుగాలి స్పర్శనై రానా...,
నీ జోలపాట నేను కానా....

నువ్వు ఆడించే బొమ్మలా...
నీ పెదవిపై చిరునవ్వులా...
నీ చెంత చేరనా కవితై...
నీ కంటి పాపకు కలనై...

నువ్వు చేరిన నా శ్వాసను నీ పేరున రాసివ్వనా...
ఈ జన్మను నీ సొంతం చేయనా....... 
నీవే నేనని తలచాను...,
నీ నవ్వే నాదని నమ్మాను...
నా ప్రేమను నీకై దాచాను...

ప్రియా... ఏ చీకటి చేరువైనా , నీ కంటికి హారతి కానా...
నా ఊపిరి ఆగిపోయినా, నీ నవ్వులో నిలిచిపోనా.....
కనులలొ నిలిచావు. .
శ్వాసలొ కలిసావు..
చిరునవ్వులా మెరిసావు..
ఇంతకీ ఎవరు నువ్వు..?

నీ చిలిపి నవ్వుతొ తెలియని బంధం,
''ఈ జన్మదేనా ..?'', అన్న చిన్న అనుమానం.. .

చందమామల కనిపిస్తావు,
మనసులొ వెన్నెలను కురిపిస్తావు..

కొలనులొ కలువలా.. .
పిల్లగాలికి విచ్చుకున్న పువ్వులా ..
నా చూపు చేరావు ..

కాలం ఇక్కడే నిలిచిపొతె...!
... ఆంతకుమించిన స్వర్గమేది ...?
"ఎవడు ఎవడికి ఎవడు...?
ఎవడు ఎవడికి ఎవడు...?
ఈ ప్రపంఛం బూటకం..,
విధి రచనకు నాటకం..,
ఏదీ కాదు సొంతం..,
ఏదీ కాదు నిత్యం..,
"నా" అన్నది వేషం..,
"నాధి" అన్నది శూన్యం...
నీలొ నిన్నే వెతుకుతూ..,
నీతొ నిన్నే చూస్తూ..
ఆగిపొక సాగిపొ... ఆగిపొక సాగిపొ..."